అచ్చెన్న, నిమ్మలపై ఏ చర్యలు తీసుకోవాలి.. ఎల్లుండి ఏపీ ప్రివిలేజ్ కమిటీ కీలక భేటీ

By Siva KodatiFirst Published Oct 6, 2021, 8:01 PM IST
Highlights

ఎల్లుండి ఏపీ అసెంబ్లీ (ap assembly) ప్రివిలేజ్ కమిటీ (privilege committee)  భేటీ కానుంది. అచ్చెన్నాయుడు (atchannaidu), నిమ్మలపై (nimmala ramanaidu) చర్యల విషయమై మరోసారి చర్చించే అవకాశం వుంది. 

ఎల్లుండి ఏపీ అసెంబ్లీ (ap assembly) ప్రివిలేజ్ కమిటీ (privilege committee)  భేటీ కానుంది. అచ్చెన్నాయుడు (atchannaidu), నిమ్మలపై (nimmala ramanaidu) చర్యల విషయమై మరోసారి చర్చించే అవకాశం వుంది. అచ్చెన్న, నిమ్మలపై తీసుకోవాలని ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. తనపై చర్యల విషయాన్ని పక్కనబెట్టాలని ప్రివిలేజ్ కమిటీకి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. దీంతో టీడీపీ (tdp) నేత కూన రవిపై (kuna ravikumar) వచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీ పరిశీలించే అవకాశం వుంది. 

కాగా, సెప్టెంబర్ 21న  ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఛైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి (kakani govardhan reddy) అధ్యక్షతన ప్రివిలేజ్ కమిటీ భేటీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే కూన రవి, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌‌లపై (nimmagadda ramesh kumar) నమోదైన ఫిర్యాదులపై చర్చించింది ప్రివిలేజ్ కమిటీ. నోటీసు ఇచ్చిన సమయానికి తాను అందుబాటులో లేను అని ఫలితంగా నోటీసు అందుకోలేకపోయానని ప్రివిలేజ్ కమిటీకి కూన రవి సమాచారం ఇచ్చారు. తాను హైదరాబాద్ వెళ్లానని .. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పిస్తానని కూన రవి చెప్పారు. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు తనకు మరో అవకాశం ఇవ్వాలని కూన రవి కోరారు.

ALso Read:మీరు స్పీకర్ పోడియం ఎక్కింది మరిచారా..?: ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కు టిడిపి ఎమ్మెల్యే లేఖ

మరోవైపు తనకు అందిన నోటీసుకు ప్రివిలేజ్ కమిటీకి లేఖ రూపంలో సమాధానం ఇచ్చారు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. తనకు గవర్నర్‌కు మధ్య జరిగిన అంతర్గత సమాచార వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు నిమ్మగడ్డ. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో వుందనే విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు మాజీ ఎస్ఈసీ.

ఇక స్పీకర్ తమ్మినేని సీతారాంపై (tammineni sitaram) వ్యాఖ్యలకు సంబంధించి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేయడంతో .. ప్రివిలేజ్ కమిటీ సభ్యుల అభిప్రాయాలు కోరారు ఛైర్మన్ కాకాని. అయితే స్పీకర్‌ను దూషించారనే ఫిర్యాదుతో అచ్చెన్నాయుడు క్షమాపణలను పరిగణనలోనికి తీసుకుని క్షమించింది ప్రివిలేజ్ కమిటీ. అయితే స్పీకర్‌పై మరోసారి వ్యాఖ్యలు చేయకుండా అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు మైక్ ఇవ్వకూడదని సభాపతికి కమిటీ సిఫారసు చేసింది. 

click me!