వాటిని చాలెంజ్ చేసే హక్కు ఉద్యోగులకు లేదు.. పీఆర్సీ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

By Sumanth KanukulaFirst Published Jan 24, 2022, 1:44 PM IST
Highlights

పీఆర్సీ జీవోలను సవాలు చేస్తూ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
 

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీపై వివాదం (AP PRC Issue) కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని, తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ జీవోలు సవాలు చేస్తూ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించింది. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య కోర్టులో పిటిషన్ వేశారు. విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్ తగ్గకూడదని పిటిషన్ లో కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై నేడు (జనవరి 24)న ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 

విచారణ సందర్భంగా.. ఉద్యోగుల తరఫున వాదనలు న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. పీఆర్సీని నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయలేదని తెలిపారు.. నోటీసు లేకుండా ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం చట్టవిరుద్దం అని అన్నారు. హెచ్‌ఆర్‌ఏ విభజన చట్టప్రకారం జరగలేదని అని చెప్పారు. మరోవైపు ఉద్యోగుల గ్రాస్ జీతాలు పెరిగాయని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన డేటాను కోర్టుకు తెలిపారు.

ఈ సందర్బంగా హైకోర్టు స్పందిస్తూ.. పర్సంటేజ్‌ను చాలెంజ్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదని తెలిపింది. ఎంత జీతం తగ్గిందో చెప్పాలని ప్రశ్నించింది. పూర్తి డేటా లేకుండా పిటిషన్ ఎలా వేస్తారని అసహనం వ్యక్తం చేసింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకపోతే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది.  జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ఉద్యోగులకు పీఆర్సీ పెరిగిందో..? లేదో..? చెప్పాలని ప్రశ్నించింది. జీతం పెరిగిందా లేదా లేదా అనేది అంకెల్లో చెప్పాలని ఆదేశించింది.  ఈ పిటిషన్‌లో లీగల్ శాంటిటి లేదని హైకోర్టు అభిప్రాయపడింది. 

ఈ క్రమంలోనే తమ ముందు పిటిషనర్ హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మె నోటీసు ఇవ్వనున్న 12 ఉద్యోగ సంఘాల నాయకులను విచారణకు హాజరు కావాలని సూచించింది. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య సమస్య జఠిలం కాకూడదని కోర్టు తెలిపింది. అందుకే ఉద్యోగ సంఘాల నేతలను విచారణకు పిలిచినట్టుగా పేర్కొంది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. 

click me!