దెబ్బలు తింటాను, తల ఎగిరిపోయినా పర్వాలేదు: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

By Nagaraju penumala  |  First Published Dec 3, 2019, 3:18 PM IST

రాజకీయాల్లోకి వస్తే దెబ్బలు తింటానని తెలుసు, దాడులు ఎదుర్కొంటానని కూడా తెలుసునన్నారు. రోజూ చీవాట్లు కూడా భరిస్తానని కూడా తనకు ముందే తెలుసునని అన్నింటికీ తెగించే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. 


తిరుపతి: వ్యక్తిగత రాజకీయ జీవితంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నింటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రాజకీయాల్లోకి వస్తే దెబ్బలు తింటానని తెలుసు, దాడులు ఎదుర్కొంటానని కూడా తెలుసునన్నారు. 

రోజూ చీవాట్లు కూడా భరిస్తానని కూడా తనకు ముందే తెలుసునని అన్నింటికీ తెగించే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. నా తలకాయ ఎగిరిపోయినా పర్వాలేదని కానీ తాను వెనకడుగు వేయలేదన్నారు. 

Latest Videos

undefined

తాను ఇకపై రాజకీయాల్లోనే కొనసాగుతానని తెలిపారు. రాజకీయాల నుంచి వైదొలిగే పరిస్థితి లేదన్నారు. వెళ్లలేని పరిస్థితి తనకు ఎదురైందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. 

ప్రజల కష్టాలను తీర్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పుట్టబోయే బిడ్డ భవిష్యత్ కోసం తాను పనిచేస్తానని తెలిపారు. ప్రాణం మీద తీపి లేదు, ఆస్తులపై మమకారం కూడా తనకు లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 

తాను ప్రస్తుతం కత్తి అంచుమీద ప్రయాణిస్తున్నట్లు తనకు తెలుసునన్నారు. ఒకవేళ తెగితే తలతెగి పడిపోతుందన్నారు. జైల్లో వందలరోజులు ఉన్న వైసీపీ అధినేత జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది ప్రజా సేవే లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని తాను కాలేనా అని ప్రశ్నించారు. తాను మెుండోడునని అది ఎంత మెుండితనం అంటే అందరికీ తెలుసునన్నారు. 

జగన్! చేతకాకపోతే గద్దె దిగు, ఎన్నికల్లో తేల్చుకుందాం: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఇకపోతే వ్యక్తిగతంగా తనకంటూ ఒక గుర్తింపు ఉందన్నారు పవన్ కళ్యాణ్. తాను కష్టాన్ని నమ్ముకునే వ్యక్తినని తెలిపారు. తనకు ఎలాంటి కష్టాలు లేవని సుఖంగానే ఉన్నానని తెలిపారు. సమాజంలో నడుస్తున్న లోపాలను అధిగమించాలని, ప్రతీ ఒక్కరూ బాగుపడాలనే లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 

ఏదైనా జరిగితే తాను కళ్లుమూసుకుని వెళ్లిపోయే వ్యక్తిని కాదన్నారు. ఒకరు ప్రమాదంలో ఉంటే అతడిని ఎలా కాపాడాలా అని ఆలోచించే వ్యక్తిని అని స్పష్టం చేశారు. తన వల్ల అతనికి ఏమైనా ఉపయోగం జరిగితే చేయడానికి ముందుకు దూకే వ్యక్తిని తాను అంటూ చెప్పుకొచ్చారు. 

ధర్మాన్ని రక్షిస్తే అదే మనల్ని రక్షిస్తుందని తాను నమ్మే వ్యక్తిని అని చెప్పుకొచ్చారు. ధర్మాన్ని తన దగ్గర పెట్టుకుని ఎదురుగా అన్యాయం జరుగుతున్నా కళ్లకు గంతలు కట్టుకునే వ్యక్తిని కాదన్నారు పవన్ కళ్యాణ్. 

సున్నితమైన అంశాలనే అస్త్రాలుగా చేసుకునే రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జగన్ లాంటి వ్యక్తులు కులాన్ని, ప్రాంతీయతను, మతాన్ని ఓట్లు కోసం వాడుకోవచ్చు గానీ ప్రజలను మాత్రం పట్టించుకోరా అంటూ విరుచుకుపడ్డారు. 

తనకు రాజకీయాల్లోకి వచ్చి ఇలా తిట్లు తినాల్సిన  అవసరం లేదన్నారు పవన్ కళ్యాణ్. అయితే సమాజంలో ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై విరక్తి చెందే తాను రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని కష్టాలు పడుతున్నట్లు తెలిపారు. 
 

click me!