తిరుపతి : చంద్రబాబు రాయలచెరువు పరిశీలనకు పోలీసుల అనుమతి నిరాకరణ, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Nov 24, 2021, 04:45 PM IST
తిరుపతి : చంద్రబాబు రాయలచెరువు పరిశీలనకు పోలీసుల అనుమతి నిరాకరణ, ఉద్రిక్తత

సారాంశం

ప్రతిపక్షనేత, టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు తిరుపతి (tirupati) పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. రాయలచెరువును (rayala cheruvu) పరిశీలించేందుకు  వెళ్లిన చంద్రబాబును అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. రాయలచెరువును రెడ్ జోన్‌గా ప్రకటించినందున ఈ ప్రాంతంలో పర్యటించేందుకు వీలు లేదని పోలీసులు తెలిపారు

ప్రతిపక్షనేత, టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు తిరుపతి (tirupati) పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. రాయలచెరువును (rayala cheruvu) పరిశీలించేందుకు  వెళ్లిన చంద్రబాబును అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. రాయలచెరువును రెడ్ జోన్‌గా ప్రకటించినందున ఈ ప్రాంతంలో పర్యటించేందుకు వీలు లేదని పోలీసులు తెలిపారు. అయితే తాను రాయల చెరువును పరిశీలించిన తర్వాతే తిరిగి వెళ్తానంటూ చంద్రబాబు భీష్మించుకుని  కూర్చొన్నారు. 

అంతకుముందు చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ చీఫ్ chandrababu naidu  బుధవారం నాడు పర్యటించారు. ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే ప్రజలకు వరద కష్టాలు వచ్చేవి కావని చంద్రబాబు నాయుడు చెప్పారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు చెప్పారు. 

ALso Read:మడమ తిప్పడం, మాట మార్చడమే జగన్ నైజం: చిత్తూరులో చంద్రబాబు

తాను తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై తప్పుడు కేసులు బనాయించిన వారిపై జ్యూడిషీయల్ విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని టీడీపీ చీఫ్ చంద్రబాబు హెచ్చరించారు.ఆంధ్రప్రదేశ్ శాసనసభను కౌరవ సభగా మార్చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ సభను మళ్లీ గౌరవ సభగా మార్చి ఆ సభకే వస్తానని చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలోనే తన భార్య గురించి మాట్లాడారని... ఈ వ్యాఖ్యలు తనకు బాధను కల్గించాయని చంద్రబాబు చెప్పారు.  దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్దామని సీఎం జగన్ కు చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు.

రెండున్నర ఏళ్లుగా తనను వేధించారన్నారు. టీడీపీ నాయకులను వేధించారని చెప్పారు. విశాఖపట్టణానికి వెళ్తే తనను రాకుండా అడ్డుకొన్నారన్నారు.  పల్నాడుకు వెళ్లకుండా తనను వెళ్లకుండా పోలీసులు అడ్డుకొన్నారని చెప్పారు. తన ఇంటిపై కూడా వైసీపీ దాడికి యత్నించారన్నారు. తనతో మాట్లాడడానికి వచ్చారని  పోలీసులు ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తే  తనకు మతి పోయిందని చెప్పారు. ఈ పోలీసుల స్టేట్ మెంట్  చూస్తే ఆ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని అర్ధమైందన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్