ఏపీలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 6,511 పోస్టులు..

Published : Nov 28, 2022, 03:17 PM IST
ఏపీలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 6,511 పోస్టులు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పోలీసు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదలైంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పోలీసు నియామమకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదలైంది. 411 సివిల్, రిజర్వు సబ్ ఇన్‌‌స్పెక్టర్ పోస్టుల నియమాకానికి, 6,100 సివిల్, ఏపీఎస్పీ పోలీసు కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. 2023 ఫిబ్రవరి 19న సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. 2023 జనవరి 22న కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. సివిల్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో హోం గార్డులకు 15 శాతం రిజర్వేషన్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో హోం గార్డులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu