విజయనగరం జిల్లాలో విషాదం: భార్య మరణించిన కొద్ది క్షణాలకే భర్త మృతి

Published : Jan 24, 2021, 11:32 AM IST
విజయనగరం జిల్లాలో విషాదం: భార్య మరణించిన కొద్ది క్షణాలకే భర్త మృతి

సారాంశం

 భార్య మరణించిన కొద్ది గంటల్లోనే భర్త మరణించిన ఘటన  విజయనగరం జిల్లాలో చోటు చేసుకొంది.   

విజయనగరం: భార్య మరణించిన కొద్ది గంటల్లోనే భర్త మరణించిన ఘటన  విజయనగరం జిల్లాలో చోటు చేసుకొంది. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలోని పందిరప్పన్న కూడలిలో మనోహర్, సూర్య ప్రభావతి దంపతులు నివాసం ఉంటున్నారు. 

శనివారం నాడు రాత్రి సూర్య ప్రభావతికి గుండెపోటు వచ్చింది. ఈ గుండెపోటు రావడంతో  ఆయన 108 సిబ్బందికి ఫోన్ చేశాడు.  ఈ ఫోన్ వచ్చిన వెంటనే  108 సిబ్బంది  సూర్యప్రభావతిని పరీక్షించారు. ఆమెను పరీక్షించిన వైద్య సిబ్బంది ఆమె మరణించిందని చెప్పారు.

అయితే ఈ విషయాన్ని బంధువులకు చెప్పేందుకు ఫోన్ తీసి కుప్పకూలిపోయాడు.  వెంటనే అక్కడే ఉన్న  108 సిబ్బంది అతడిని పరీక్షించారు.  ఆయన కూడ మరణించినట్టుగా వైద్య సిబ్బంది ప్రకటించారు.

క్షణాల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. భార్య మరణించిన విషయం తెలుసుకొన్న భర్త మనోహర్ కు కూడ గుండెపోటు వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు.

మనోహర్ ఎల్ఐసీలో డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. కొడుకు డిగ్రీ పూర్తి చేశాడు.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu