పీఆర్సీ వివాదం.. ఉద్యోగులకు పోలీస్ శాఖ షాక్, ఛలో విజయవాడకు అనుమతి నిరాకరణ

Siva Kodati |  
Published : Feb 01, 2022, 09:21 PM ISTUpdated : Feb 01, 2022, 09:28 PM IST
పీఆర్సీ  వివాదం.. ఉద్యోగులకు పోలీస్ శాఖ షాక్, ఛలో విజయవాడకు అనుమతి నిరాకరణ

సారాంశం

పీఆర్సీ (prc) కోసం ఉద్యమిస్తున్న ప్రభుత్వోద్యోగులకు పోలీస్ శాఖ (ap police) షాకిచ్చింది. ఈ నెల 3న ఛలో విజయవాడకు (chalo vijayawada) అనుమతి నిరాకరిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమీషనర్ క్రాంతిరాణా (kranthi rana tata) తెలిపారు. కరోనా నిబంధనల (covid) కారణంగా ఛలో విజయవాడకు అనుమతి ఇవ్వడం లేదని సీపీ పేర్కొన్నారు. 

పీఆర్సీ (prc) కోసం ఉద్యమిస్తున్న ప్రభుత్వోద్యోగులకు పోలీస్ శాఖ (ap police) షాకిచ్చింది. ఈ నెల 3న ఛలో విజయవాడకు (chalo vijayawada) అనుమతి నిరాకరిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమీషనర్ క్రాంతిరాణా (kranthi rana tata) తెలిపారు. కరోనా నిబంధనల (covid) కారణంగా ఛలో విజయవాడకు అనుమతి ఇవ్వడం లేదని సీపీ పేర్కొన్నారు. ఛలో విజయవాడ కార్యక్రమం చట్టవిరుద్ధమని క్రాంతి రాణా అన్నారు. ఉద్యోగుల కాండాక్ట్ రూల్స్ ప్రకారం కూడా.. ఛలో విజయవాడ కార్యక్రమం చేయకూడదని సీపీ వ్యాఖ్యానించారు. 

కాగా.. ప్రభుత్వ సంప్రదింపుల కమిటీతో PRC సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు (ఏపీ Employees సంఘాల నేతలు) మంగళవారం నాడు సచివాలయంలో భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానిస్తూ మంత్రుల కమిటీ సోమవారం నాడు రాత్రి లేఖలు పంపింది. పీఆర్సీ సాధన సమితిలో కీలకంగా ఉన్న నేతలందరికీ కూడా AP Govenrment ఈ lettersలను అందించింది. 

రాష్ట్ర ప్రభుత్వం నుండి లిఖితపూర్వక హామీ వస్తేనే చర్చలకు హాజరరౌతామని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. దీంతో  ప్రభుత్వం నిన్న లిఖితపూర్వకంగా ఉద్యోగులను చర్చలకు ఆహ్వానం పంపింది.అయితే గతంలో తాము ప్రభుత్వం ముందుంచిన పీఆర్సీ జీవోలను  అభయన్స్ లో పెట్టాలని, పాత జీతాలను ఇవ్వాలని, ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయట పెట్టాలని కూడా పీఆర్సీ సాధన సమితి డిమాండ్ చేసింది.ఈ డిమాండ్లకు తలొగ్గి రాత పూర్వకంగా చర్చలకు ఆహ్వానిస్తే తాము చర్చలకు వెళ్తామని సోమవారం నాడు పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు.

అయితే ఇవాళ మంత్రుల కమిటీ నుండి వచ్చిన ఆహ్వానంపై పీఆర్సీ సాధన సమితి నేతలు సమావేశమై చర్చించారు.మంత్రుల కమిటీ నుంచి లిఖిత పూర్వకంగా ఆహ్వానం వచ్చినందున చర్చలకు వెళ్లాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. మంత్రుల కమిటీ ముందుకు వెళ్లి ఇప్పటికే ఇచ్చిన డిమాండ్లను మరోసారి ఉంచాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. Ashutosh Mishra committee కమిటీ నివేదికను బయట పెట్టాలని, పీఆర్సీ జీవోలను నిలిపివేయాలని పీఆర్సీ సాధన సమితి నేతలు డిమాండ్ చేయనున్నారు. మరో వైపు January నెలకు పాత జీతాలను ఇవ్వాలని కూడా డిమాండ్ చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu