ప్రత్యేక హోదాపై రాహుల్ తొలిసంతకం: రఘువీరారెడ్డి

By Nagaraju TFirst Published Oct 12, 2018, 3:50 PM IST
Highlights

ప్రధాని అయిన వెంటనే ప్రత్యేక హోదా దస్త్రంపైనే రాహుల్ గాంధీ తొలిసంతకం చేస్తారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన రఘువీరా ఒకవేళ హోదా ఇవ్వకపోతే ఏపీలో మళ్లీ అడుగుపెట్టనని చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను రాహుల్ కు వివరించినట్లు తెలిపారు. 

ఢిల్లీ: ప్రధాని అయిన వెంటనే ప్రత్యేక హోదా దస్త్రంపైనే రాహుల్ గాంధీ తొలిసంతకం చేస్తారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన రఘువీరా ఒకవేళ హోదా ఇవ్వకపోతే ఏపీలో మళ్లీ అడుగుపెట్టనని చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను రాహుల్ కు వివరించినట్లు తెలిపారు. 

అసెంబ్లీ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ రాజీనామాను ఆమోదించినట్టు వెల్లడించారు. కొందరు అవకాశవాదులు పార్టీలు మారుతున్నారన్న రఘువీరా కాంగ్రెస్‌లోకి చాలామంది వస్తుంటారు వెళ్తుంటారని ఇది నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్యానించారు.  

మరోవైపు విశాఖపట్నం, తిరుపతి సభలకు రాహుల్‌ గాంధీని ఆహ్వానించినట్లు రఘువీరారెడ్డి తెలిపారు. సభలకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తంచేశారని వెల్లడించారు. ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని రాహుల్‌ హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో ఇంటింటా కాంగ్రెస్ ‌కార్యక్రమం చురుగ్గా సాగుతోందన్నారు.

click me!