ఏపీ పరిషత్ ఎన్నికల విచిత్రం: వారు గెలిస్తే మళ్లీ అక్కడ ఎన్నికలు

By telugu teamFirst Published Sep 19, 2021, 11:09 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిషత్ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘ కాలం జరిగింది. నామినేషన్ల ఘట్టానికి పోిలంగ్ కు మధ్య ఏడాది ఖాళీ రాగా, పోలింగ్ కు ఓట్ల లెక్కింపునకు మధ్య ఆరు నెలల ఖాళీ ఏర్పడింది. దీంతో విచిత్రమైన పరిస్థితి నెలకొంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ రాష్ట్రంలో సుదీర్ఘం కాలం కొనసాగింది. ఆదివారంనాడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు గెలిస్తే వారి స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

దానికి ప్రధాన కారణం ఆ స్థానాల్లో పోటీ చేసిన 23 మంది ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో మరణించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత హైకోర్టు కేసు కారణంగా ఆరు నెలల పాటు లెక్కింపు ఆగిపోయింది. ఎన్నికలు జరిగిన 23 స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు మరణించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ నిర్ధారించింది. 

Also Read: ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు: దూసుకుపోతున్న జగన్ పార్టీ, చంద్రబాబుకు ఎదురుదెబ్బ

ఎంపీటీసీ సీట్లలో పోటీ చేసిన 20 మంది, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసిన ముగ్గురు మరణించారు. ఈ స్థానాల్లో మరణించిన అభ్యర్థులు గెలిస్తే తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని అంటున్నారు. మరణించిన అభ్యర్థులు విజయం సాధిస్తే ఏం చేయాలో చెప్పాలంటూ ఆయా జిల్లాల అధికారులు ఎన్నికల కమిషన్ ను కోరారు. 

ఒక వేళ మృతి చెందిన అభ్యర్థులు గెలిస్తే ఆ ఫలితాన్ని వెల్లడించి, తిరిగి ఎన్నిక నిర్వహించాల్సిన స్థానాల జాబితాలో చేర్చాలని ఎన్నికల కమిషన్ అధికారులకు స్పష్టం చేసింది. పోలింగ్ కు, హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఓట్ల లెక్కింపునకు మధ్య ఉన్న సుదీర్ఘ గడువు మాత్రమే కాకుండా నామినేషన్ల ఘట్టానికి, పోలింగ్ ప్రక్రియకు మధ్య కూడా ఏడాది పాటు వ్వవధి ఏర్పడింది. ఆ సమయంలో మరణించినవారి స్థానాల్లో పోలింగును అపేశారు. 

Also Read: ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు: ఖాతా తెరిచిన పవన్ కల్యాణ్ జనసేన

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైసీపీ దరిదాపుల్లో కూడా లేదు. 

click me!