ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు మహా వేగంతో దూసుకుపోతోంది. కాగా, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన తన ఖాతా తెరిచింది. కొన్ని ఎంపీటీసీ సీట్లను గెలుచుకుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన ఖాతా తెరిచింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. ఈ లెక్కింపులో పవన్ కల్యాణ్ జనసేన కొన్ని ఎంపీటీసీ సీట్లను కైవసం చేసుకుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఫలితాల్లో దూసుకుపోతోంది. ఆయన సొంత జిల్లా కడపలో ప్రతిపక్షాలు ఏ మాత్రం సీట్లు వచ్చే అవకాశం కూడా లేదు. ఆదివారం ఉదయం 10 గంటల వరకు టీడీపీకి గానీ, ఇతర ప్రతిపక్షాలకు గానీ కడప జిల్లాలో ఒక్క సీటు కూడా రాలేదు.
undefined
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రం 33 ఎంపీటీసీ సీట్లు సాధించింది. కాగా, బిజెపి కూడా ఏ మాత్రం సత్తా చాటలేకపోయింది. కర్నూలు జిల్లాలో బిజెపి 2 ఎంపీసీ సీట్లు గెలుచుకుంది.
ఇదిలావుంటే, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఉదయం 10 గంటల సమయం వరకు ఏడు ఎంపీటీసీ సీట్లను గెలుచుకుంది. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో రెండేసీ ఎంపీటీసీ సీట్లను జనసేన గెలుచుకుంది. గుంటూరు, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కటేసి ఎంపీటీసీ సీట్లను జనసేన గెలుచుకుంది.