ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది. ముందుగా నిర్ణయించిన వారినే పదవులు వరించాయి. ఒక్క విశాఖ జడ్పీ ఛైర్మన్ అభ్యర్ధిని మాత్రం వైసీపీ అధిష్టానం మార్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది. ముందుగా నిర్ణయించిన వారినే పదవులు వరించాయి. ఒక్క విశాఖ జడ్పీ ఛైర్మన్ అభ్యర్ధిని మాత్రం వైసీపీ అధిష్టానం మార్చింది. పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా కవురు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక వైస్ ఛైర్మన్‌లుగా పెనమాల విజయ్ బాబు, శ్రీలేఖలను వరించింది. తూర్పుగోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా పి గన్నవరం నుంచి గెలుపొందిన విపర్తి వేణుగోపాల్ ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ ఛైర్మన్‌లుగా బుర్రా అనుబాబు, మేరుగ పద్మలత ఎన్నికయ్యారు.
ఇక గుంటూరు జడ్పీ ఛైర్మన్‌గా కత్తెర హెని క్రిస్టినా, వైస్ ఛైర్మన్‌లుగా నర్సిరెడ్డి, అనురాధలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కర్నూలు జడ్పీ ఛైర్మన్‌గా మల్లిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి.. వైఎస్ ఛైర్మన్‌లుగా జిల్ సత్ నాయక్, బుజ్జిమ్మలు ఎన్నికయ్యారు. ఇక విశాఖ జడ్పీ ఛైర్మన్ పదవికి ముంచంగిపుట్ట జడ్పీటీసీ సభ్యురాలు సుభద్ర ఎన్నికయ్యారు. అలాగే అప్పారావు, సత్యవతిలను వైఎస్ ఛైర్మన్ పదవి వరించింది.