బాలు శివైక్యం చెంది ఏడాదయ్యిందంటే నమ్మాలనిపించడం లేదు : చంద్రబాబు

By AN TeluguFirst Published Sep 25, 2021, 3:30 PM IST
Highlights

‘‘మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. అందుకే ఆయన శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మాలని అనిపించడంలేదు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ప్రథమ వర్ధంతి సందర్భముగా ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

అమరావతి : నేడుగాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam) వర్థంతి (Death Anniversary). ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) ఆయనను గుర్తు చేసుకున్నారు. బాలు లేరన్న విషయాన్ని నమ్మాలనిపించడం లేదని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. అందుకే ఆయన శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మాలని అనిపించడంలేదు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ప్రథమ వర్ధంతి సందర్భముగా ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా, ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీబాలసుబ్రమణ్యం... నలభై రోజుల పాటు కరోనాతో పోరాడి సెప్టెంబర్ 25,2020లో కన్నుమూసి నేటికి సరిగ్గా యేడాది. సెప్టెంబర్ 25, శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనాతో చేసిన పోరాటంలో ఓడిపోయారు. అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తారు. భారతీయ చిత్రపరిశ్రమని విషాదంలో నింపారు.

అంతకు ముందే కరోనా కారణంగా ఆగస్ట్ మొదటి వారంలో బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో జాయిన్‌ అయిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఒకానొక టైమ్‌లో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఐసీయూలో, వెంటిలేషన్‌పై చికిత్స అందించారు. ఆ తర్వాత ఎక్మో విధానంలోనూ ట్రీట్‌ మెంట్‌ అందించారు. విదేశీ వైద్యులు సైతం ఆయనకు ట్రీట్‌మెంట్‌ చేశారు. ఎంతో పోరాటం చేసిన మీదట చనిపోయే వారం ముందు కరోనా నెగటివ్‌ వచ్చినట్టు వెల్లడించారు. ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. క్రమంగా ఆయన ఆరోగ్యం కోలుకుంటుందని, మాట్లాడుతున్నారని తెలిపారు.

లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలు ఇకలేరు..శోక సంద్రంలో సినీలోకం

కానీ గురువారం ఆయనకు మళ్లీ సీరియస్‌ అయ్యిందన్నారు. పరిస్థితి మరోసారి బాలు ఆరోగ్యం విషమించినట్టు, ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటనలో తెలిపారు. చాలా క్రిటికల్‌గా ఉందని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 

బాలు ఆరోగ్యం విషమించిందన్న వార్తతో సినీ ప్రముఖులు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని ఆయన్ని పరామర్శించారు. కమల్‌ హాసన్‌ గురువారం రాత్రి ఆసుపత్రి చేసుకుని పరిస్థితి ఆరా తీశారు. బాలు కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో బాలు ఆరోగ్యం మరింత క్షీణించిందని, మరింత ఆందోళన కరంగా ఉందని అందరికీ అర్థమైపోయింది. అందరూ భయపడ్డట్టుగానే జరిగింది. బాలు మనల్ని విడిచి శివైక్యం పొందారు. 

click me!