బిజెపికి 'అర్బన్' షాక్: పవన్ కల్యాణ్ జనసేన కాస్తా బెటర్

Published : Mar 15, 2021, 09:13 AM ISTUpdated : Mar 15, 2021, 09:14 AM IST
బిజెపికి 'అర్బన్' షాక్: పవన్ కల్యాణ్ జనసేన కాస్తా బెటర్

సారాంశం

బిజెపితో కలిసి పోటీ చేసిన పవన్ కల్యాణ్ జనసేన మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టింది. మిత్రపక్షం బిజెపి కన్నా జనసేన మెరుగైనా ఫలితాలు సాధించింది. బిజెపికి నగర, పట్టణ ప్రజలు షాక్ ఇచ్చారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కుని వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పాగా వేస్తామని మాట్లాడుతున్న బిజెపి నేతలు మున్సిపల్ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను చవిచూసింది. 

మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి 7 వార్డుల్లో విజయం సాధించింది. జనసేనతో పొత్తు పెట్టుకుని బిజెపి ఎన్నికల బరిలోకి దిగింది. కొవ్వూరు, హిందూపురం, గూడూరు మున్సిపాలిటిల్లో ఒక్కో వార్డును బిజెపి గెలుచుకుది. ఆళ్లగడ్డ, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లో రెండేసి వార్డులను గెలుచుకుంది. కార్పోరేషన్లకు జరిగిన ఎన్నకల్లో విశాఖపట్నంలో ఓ డివిజన్ లో విజయం సాధించింది. 

Also Read: పొత్తుకు బీటలు: బిజెపితో పవన్ కల్యాణ్ దోస్తీ కటీఫ్?

మున్సిపాలిటీలు, కార్పోరేషన్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన తొలిసారి పోటీ చిసింది. బిజెపితో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. రాష్ట్రంలో జనసేన 320 వార్డుల్లో పోటీ చేసిందని, వాటిలో 18 వార్డులను గెలుచుకుంది. 10 మున్సిపాలిటీల్లో జనసేన ఆ వార్డులను గెలుచుకుంది. 

అమలాపురంలో ఆరు వార్డులను గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో 4 వార్డులను గెలుచుకుంది. మున్సిపాలిటీల్లో జనసేన 224 స్థానాలకు పోటీ చేసి 7 చోట్ల విజయం సాధించింది. విశాఖపట్నం కార్పోరేషన్ ఎన్నికల్లో మూడు డివిజన్లను, గుంటూరులో 2 రెండు డివిజన్లను గెలుచుకుంది. ఒంగోలు, మచిలిపట్నంల్లో ఒక్కో డివిజన్ లో విజయం సాధించింది.

మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థులు 3 వార్డులు, 3 డివిజన్లు గెలుచుకున్నారు సీపీఐ 3 వార్డులను, ఒక్క డివిజన్ ను గెలుచుకుంది. సిపిఎం రెండు డివిజన్లలో విజయం సాధించింది. విశాఖపట్నంలో సీపీఐ, సీపిఎం చెరో డివిజన్ ను దక్కించుకున్ాయి. విజయవాడలో సీపీఎం ఒక్క డివిజన్ ను గెలుచుకుంది. రాయలసీమలోని గుంతకల్, తాడిపత్రి, డోన్ ల్లో ఒక్కో వార్డుల్లో సిపిఐ విజయం సాధించింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!