దారితప్పిన కూతురు.. అక్రమ సంబంధం.. తండ్రి ఏం చేశాడంటే..

Published : Mar 15, 2021, 08:52 AM IST
దారితప్పిన కూతురు.. అక్రమ సంబంధం.. తండ్రి ఏం చేశాడంటే..

సారాంశం

కూతురు చేసిన పనికి ఎక్కడ పరువు పోతుందోనని.. కూతురిని అంతమొందించాడు.

కూతురు దారి తప్పడం ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. అల్లుడిని కాదని కూతురు మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి.. ఏకంగా కూతురినే చంపేశాడు. కూతురు చేసిన పనికి ఎక్కడ పరువు పోతుందోనని.. కూతురిని అంతమొందించాడు. ఈ సంఘటన కడప జిల్లా వేంపల్ల పట్టణంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోరుమామిళ్ల వనజారాణి(29) కి గురువేంద్ర అనే వ్యక్తదితో 2009లో వివాహమైంది. వీరి కుమార్తె గురు పూజిత మూడో తరగతి చదువుతోంది. గురువేంద్ర బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లగా... వనజారాణి తన తల్లిదండ్రుల తో పాటు ప్రొద్దుటూరులో ఉంటోంది. ఈ క్రమంలో వనజారాణి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌ నుంచి ఆమె భర్త వేంపల్లెకు వచ్చాడు.అప్పటి నుంచి ఆమె తన భర్తతో తనకు విడాకులు ఇవ్వాలని, మరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనిపై వారం రోజుల నుంచి భర్తతో ఆమె గొడవపడుతోంది. విషయాన్ని వనజారాణి తల్లిదండ్రులకు గురువేంద్ర చెప్పి ఆమెకు నచ్చజెప్పాలని వారిని కోరాడు. వనజారాణి తండ్రి రాజశేఖర్, చిన్నాన్న జనార్థన్, మరొకరు శనివారం రాత్రి ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.  ఆమె వినిపించుకోలేదు. దీంతో  చున్నీని మెడకు చుట్టి ఆమెను హత్య చేశారు. కన్న తండ్రే ఆమెను చంపేయడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP