ఉద్యోగులను అణగదొక్కిన వారంతా భ్రష్టు పట్టారు: ఎమ్మెల్సీ లక్షణరావు

By narsimha lodeFirst Published Jan 23, 2022, 3:19 PM IST
Highlights


పీఆర్సీ విషయమై ఏపీ ఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని ఆయన గుర్తు చేశారు.

విజయవాడ: ఉద్యోగులను అణగదొక్కాలని చూసిన వారంతా భ్రష్టు పట్టారని ఎమ్మెల్సీ Laxmana rao చెప్పారు.Vijayawada ఏపీ ఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన   రౌండ్ టేబుల్ సమావేశంలో లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అప్రజాస్వామిక విధానాలు అవలంభించిన ప్రభుత్వాలు కూలిపోక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ప్రభుత్వం నడుస్తుందని ఆయన చెప్పారు.ఉద్యోగులు కూడా రాజ్యాంగంలో భాగమేనన్నారు. వారితో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. PRC  జీవోలను రద్దు చేయాలని  ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. PDF తరపున ఉద్యోగ సంఘాల ఆందోళనకు తాము మద్దతిస్తున్నామన్నారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయకుండా పీఆర్సీని ప్రకటించడం ఎప్పుడూ కూడా జరగలేదని ఆయన గుర్తు చేశారు.

ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.ఉద్యోగులకు వ్యతిరేకంగా వలంటీర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.Corona పరిస్థితుల్లో కూడా తెలంగాణ కంటే ఏపీకి ఆదాయం ఎక్కువగా వచ్చిందని ఏపీ ఎన్జీఓ నేత Vidyasagar చెప్పారు. ఉద్యోగులకు తప్పుడు సమాచారం ఇస్తూ  ప్రభుత్వం మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

ప్రభుత్వంలో Rtc ని విలీనం చేసినా కూడా తమ సమస్యలు తీరలేదని ఆర్టీసీ ఎన్ఎంయూ నేత సుజాత అభిప్రాయపడ్డారు. తమకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు  ఇస్తారని భావిస్తే కేలవం 19 శాతం మాత్రమే ఐఆర్ ఇచ్చారనన్నారు.

ఉద్యోగులు సమ్మె చేసినా ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు తిరిగి ఎన్నికల్లో గెలవలేదని ఏపీటీఎఫ్ నేత పాండురంగ ప్రసాద్ చెప్పారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం నవరత్నాల్లో ఓపథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం  తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం Ys Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.తక్కువ  ఫిట్‌మెంట్ ఇచ్చినా పీఆర్సీ ఫిట్‌మెట్ కు అంగీకరించినా ప్రభుత్వం హెచ్ఆర్‌ఏ తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

click me!