
సీఎం జగన్ అంబేడ్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారని మంత్రి తానేటి వనిత అన్నారు. వైసీపీ ప్లీనరీలో సామాజిక సాధికారత తీర్మానంపై చర్చ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ.. సీఎం జగన్ దళిత మహిళను హోం మంత్రిని చేశారని చెప్పారు. గతంలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసేవారని.. కానీ సీఎం జగన్ బీసీలను బ్యాక్ బోన్‌గా చేశారని చెప్పారు. బలహీనవర్గాలను బలవంతులుగా మార్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందని అన్నారు. దళితులను దర్జాగా బతికేలా చేశారని చెప్పారు. సీఎం జగన్ తండ్రికి తగ్గ తనయుడు అని అన్నారు. వైఎస్ జగన్ తమ అందరి ధైర్యమని మంత్రి తానేటి వనిత అన్నారు.
మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు ఏనాడైనా సామాజిక న్యాయం పాటించారా అని ప్రశ్నించారు. మాట తప్పని నాయకుడు సీఎం జగన్ అని చెప్పారు. ఎన్నికల ముందు చెప్పినట్టుగా సామాజిక న్యాయం పాటించిన గొప్ప వ్యక్తి జగన్ అని తెలిపారు. సీఎం జగన్ ఆంబేడ్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారని అన్నారు.
చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. సీఎం జగన్ సామాజిక విప్లవకారుడు అని అన్నారు. చంద్రబాబు దగ్గర మాధ్యమాలు ఉంటే.. తమ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలనే నాలుగు బలమైన వర్గాలు ఉన్నాయని చెప్పారు. సీఎం జగన్ బలహీర వర్గాల అభివృద్ది కోసం బాటలు వేశారని చెప్పారు.