
దేశంలో చంద్రబాబు అంతా చవట, దద్దమ్మ లేరని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు 420 అని.. ఆయనకు ఎవరూ భయపడరని అన్నారు. వైసీపీ ప్లీనరీలో ఎల్లో మీడియా- దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా కొడాలి నాని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం హామీలను అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ భగ భగ మండే సూర్యుడు లాంటోడని అన్నారు. అసెంబ్లీలో జరగని దానికి చంద్రబాబు దొంగ ఏడుపు ఏడ్చారని విమర్శించారు. చంద్రబాబు భార్యను ఎవరు కూడా ఏమనలేదని అన్నారు. విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తే విషపు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు.
తల్లిని మించిన హోదా ఉంటుందా అని ప్రశ్నించారు. రాజారెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని వదలేడం లేదని.. అఖరికి జగన్ బిడ్డను తీసుకొచ్చారని మండిపడ్డారు. విదేశాలకు విమానంలో కాకుండా ఎలా వెళతారని ప్రశ్నించారు. పుట్టిపెరిగిన చంద్రగిరిలో చంద్రబాబు ఎప్పుడైనా గెలిచారా అని ప్రశ్నించారు. 2024లో చంద్రబాబును రాజకీయ సమాధి చేస్తామని అన్నారు. చంద్రబాబు మానసిక వైద్యశాల ఏర్పాటు చేసి.. అందులో చేరుస్తామని చెప్పారు. దుష్టచతుష్టయాన్ని పూర్తిగా మానసిక వైద్యశాలలో చేర్పించాలన్నారు.
ఇక, అంతకుముందు పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, దుష్టచతుష్టయం, పవన్ కల్యాన్ కలిసి వచ్చిన జగన్‌ను ఏమి చేయలేరని అన్నారు. ‘‘దుష్టచతుష్టయం.. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు. మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు, మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో దొంగ టీవీ5 నాయుడు. ఈ నలుగురు కలిసి మీడియా వ్యవస్థను నాశనం చేశారు’’ అని విమర్శలు గుప్పించారు. రామోజీరావు నమ్మకద్రోహి అని ఎన్టీఆర్ చెప్పారని అన్నారు.
విజయమ్మపై ఎల్లో మీడియా విషపు రాతలు రాసిందని విమర్శించారు. తన ప్రసంగం సందర్భంగా మహేష్ బాబు సినిమా డైలాగ్‌ను పేర్ని నాని ప్రస్తావించారు. చంద్రబాబు నుంచి డబ్బులు తీసుకెళితే మీ ఇంట్లో పిల్లులు, భార్య సంతోషంగా ఉంటారా..? అని ప్రశ్నించారు. సింగిల్‌గా వస్తే చితకొడతారని చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు తెలియదా అని ఎద్దేవా చేశారు. ఎంత మంది కట్టకట్టుకుని వచ్చినా జరిగేది ఏం లేదని అన్నారు. జగన్ సింహం అని చెప్పారు.
ఎవరూ పట్టించుకోవడం లేదని కొన్ని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారని.. కానీ తాను కూడా ఓ కార్యకర్తనని చెప్పారు. తన మీద జగన్ దయ తలిస్తే తాను ఎమ్మెల్యేను అయ్యానని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం కాదు.. జగన్ కోసం పనిచేయండి. జగన్ 8 నెలల్లో ఏదైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోకపోతే ఎమ్మెల్యేలను మారుస్తానని చెప్పారు.
సోనియా గాంధీకే భయపడని జగన్.. చంద్రబాబుకు భయపడతాడా అని ప్రశ్నించారు. తప్పుడు రాతలతో సంపాదించే డబ్బులతో ఎంజాయ్ చేయవచ్చు.. కానీ సుఖ శాంతులు ఉండవని అన్నారు. గతంలో నలుగురు దొంగలు రాష్ట్రాన్ని పంచుకోవాలని చూశారని మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కార్యకర్తలు జగన్ కోసం పనిచేయాలని సూచించారు. తనలాంటోళ్లు వస్తుంటారు, పోతుంటారని చెప్పారు.