వన్ నేషన్-వన్ ఎలక్షన్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే...: యనమల వివరణ

First Published Jul 12, 2018, 5:51 PM IST
Highlights

కేంద్రంలో అధికారంలో ఉన్న  బిజెపి జాతీయ పార్టీ కావడం వల్లే రీజనల్ పార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఏపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. జాతీయ పార్టీలకు, నాయకులకు ఎప్పటికైనా రీజనల్ పార్టీలతో ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన బిజెపి వాటిపై కుట్రలు పన్నుతోందన్నారు. ప్రాంతీయ పార్టీలు బ్రతకడం బిజెపికి ఇష్టం లేదని అందువల్లే నేషనల్ ఎంజెండాను ముందుకు తెస్తున్నారని మండిపడ్డారు.

ఇవాళ జరిగిన టిడిపి పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో యనమల ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన జమిలి ఎన్నికలకు టిడిపి ఎందుకు వ్యతిరేకిస్తుందో వివరించారు. ఇప్పటికే బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా అణగదొక్కేందుకే వన్ నేషన్- వన్ ట్యాక్స్  తీసుకువచ్చారని అన్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు ఆదాయాన్ని తగ్గించి ఆర్థికంగా దెబ్బతీశారని తెలిపారు. ఇప్పుడు రాజకీయంగా దెబ్బతీసేందుకే వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటున్నారని అన్నారు. వారి కుట్రలను గ్రహించే టిడిపి పార్టీ ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తోందని యనమల స్పష్టం చేశారు.

రీజనల్ లీడర్లు పైకి ఎదిగితే తమ సీట్లకు ముప్పు ఏర్పడుతుందని బిజెపి నాయకులు ఈ కుట్రలకు తెరలేపారని యనమల అన్నారు. ఈ కుట్రల గురించి ఇప్పటికే చాలామంది పొలిటికల్ అనలిస్టులు బైటపెట్టారని ఆయన పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో బిజెపి తీసుకువచ్చిన ఈ ప్రతిపాదనను టిడిపి పార్టీ ఎప్పటికీ అంగీకరించే ప్రసక్తే లేదని యనమల స్పష్టం చేశారు.

click me!