కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి కరోనా కలకలం రేపింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సామాన్యులు మొదలు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు సైతం ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులకు కూడా కరోనా సోకింది. తిరుమలలోనూ పలువురు అర్చకులు, ఉద్యోగులు ఈ వైరస్ బారిన పడగా తాజాగా టిడిపి అధ్యక్షులు వైవి. సుబ్బారెడ్డికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
ప్రస్తుతం సుబ్బారెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే వున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికి ఆయనకు కరోనా సోకడంపై వైసిపి వర్గాల్లో, సీఎం జగన్ కుటుంబంలో ఆందోళన నెలకొంది.
undefined
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు బుధవారం భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 3,892 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 7,67,465కు చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజే 28 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో 6,319కు చేరుకుంది.
గత 24 గంటల్లో 5,050 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 7,19,477కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 41,669 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 69,463 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 67,72,273కి చేరుకుంది.
గత 24 గంటల్లో అనంతపురం 290, చిత్తూరు 405, తూర్పుగోదావరి 607, గుంటూరు 345, కడప 332, కృష్ణ 458, కర్నూలు 104, నెల్లూరు 219, ప్రకాశం 146, శ్రీకాకుళం 154, విశాఖపట్నం 163, విజయనగరం 151, పశ్చిమ గోదావరిలలో 518 కేసులు నమోదయ్యాయి.
అలాగే చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణాలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, తూర్పు గోదావరిలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, శ్రీకాకులంలో ఇద్దరు, కర్నూలులో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.