చంద్రబాబు స్క్రిప్ట్‌ చదివారు: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి మంత్రి రోజా కౌంటర్

By narsimha lode  |  First Published May 25, 2022, 5:33 PM IST


అమలాపురం విధ్వంసంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారంగా ఉన్నాయని ఏపీ మంత్రి రోజా చెప్పారు. కోనసీమ జిల్లా కోసం ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి జనసేనకు చెందినవాడన్నారు.


అమరావతి:  Amalapuram విధ్యంసం పై TDP  చీఫ్ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ చదివారని ఏపీ మంత్రి  Roja విమర్శించారు. Chandrababu ప్యాకేజీ కోసం ఆయన స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడకుండా తమ పార్టీ వైఖరిని చెప్పాలని Pawan Kalyan ను కోరారు మంత్రి.

అమలాపురంలో నిన్న జరిగిన విధ్యంసంపై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బుధవారం నాడు స్పందించారు. ఈ దాడుల వెనుక వైసీపీ ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.  ఈ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటరిచ్చారు. Kona seema జిల్లా కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి Jana sena పార్టీకి చెందినవాడని రోజా ఆరోపించారు. జనసేన నాయకులతో సాయి ఫోటోలు కూడా దిగారని మంత్రి వివరించారు.

Latest Videos

also read:konaseema violance : అమలాపురం అల్లర్లపై పవన్ కల్యాణ్ సీరియస్

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తునిలో జరిగిన విధ్వంసాన్ని వైసీపీ చేయించిందని గతంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్డాన్ని కూడా విపక్షాలు ఒప్పుకున్నాయని మంత్రి రోజా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పవన్ కళ్యాణం ఏం చెప్పారంటే?
మంత్రి, ఎమ్మెల్యే ఇంటిపై వైసీపీ వారే దాడులు చేయించుకున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దని కోరారు. బుధవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

నిన్న జరిగిన గొడవ ఒక కులానికి సంబంధించినది కాదని.. కోనసీమ అంతా ఒకటిగా సంయమనం పాటించాలని ఆయన కోరారు. అంబేద్కర్ పేరు ఒక జిల్లాకు పరిమితం చేస్తామా అని పవన్ ప్రశ్నించారు. జిల్లాకు అంబేద్కర్ పేరుపై తన అభిప్రాయం ఇక్కడ అనవసరమన్నారు. భిన్నాభిప్రాయాలు వున్నప్పుడు రెఫరెండాలు వుండటం మంచిదని.. కులాల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని అనుకుంటున్నారని పవన్ ఆరోపించారు. రాష్ట్రానికి తొలి దళిత సీఎం అయిన  దామోదరం సంజీవయ్య పేరు  కర్నూలు జిల్లాకు ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. 

రాయలసీమ నుంచి వచ్చిన కొంతమంది కర్నూలుకు సంజీవయ్య పేరు వద్దన్నారని పవన్ ఆరోపించారు. సంజీవయ్య అంటే గౌరవం లేక కాదని.. కర్నూలు కర్నూలులాగే ఉండాలనుకున్నారని ఆయన తెలిపారు. అంబేద్కర్‌ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని.. వాడుకుని వదిలేస్తున్నారని పవన్ ఫైరయ్యారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని ఏ ప్రభుత్వమూ అనుకోవడం లేదని.. వైసీపీకి అంబేద్కర్ మీద ప్రేమ వుంటే.. అంబేద్కర్ కోరుకున్న ఎస్సీ  సబ్‌ప్లాన్ ఎందుకు అమలు చేయడం లేదని జనసేనాని నిలదీశారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల్లో రూ.10 వేల కోట్లను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందని పవన్ ఆరోపించారు. 

బొత్స నియోజకవర్గంలోని ఓ ఎస్సీ కాలనీకి సబ్‌ప్లాన్ నిధులు అందలేదని ఆయన దుయ్యబట్టారు. అక్కడ మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని పవన్ చెప్పారు. గొడవల వెనుక జనసేన, ఇతర పార్టీలు వున్నాయన్న హోంమంత్రి వ్యాఖ్యలకు తాము ఆశ్చర్యపోలేదన్నారు. తల్లి పెంపకం సరిగ్గా లేకపోతే అత్యాచారాలు జరుగుతూ వుంటాయన్న హోంమంత్రి అంతకంటే ఏం మాట్లాడతారని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. 

click me!