చలో రావులపాలెం నేపథ్యంలో హై అలర్ట్.. పోలీసుల అదుపులో పలువురు యువకులు..

Published : May 25, 2022, 05:24 PM IST
చలో రావులపాలెం నేపథ్యంలో హై అలర్ట్.. పోలీసుల అదుపులో పలువురు యువకులు..

సారాంశం

కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ కోనసీమ సాధన సమితి నేడు చలో రావులపాలెంకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిన్న అమలాపురంలో చోటుచేసుకన్న హింసాత్మక ఘటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. 

కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ కోనసీమ సాధన సమితి నేడు చలో రావులపాలెంకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిన్న అమలాపురంలో చోటుచేసుకన్న హింసాత్మక ఘటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అమలాపురంలో మాదిరి పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసులు భారీగా మోహరించారు. రోడ్లపైకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ఇక, సాధన సమితి పిలుపు మేరకు రావులపాలెంలో కొందరు యువకులు రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలోనే అనుమానస్పదంగా తిరుగుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్‌లు, ఆటోల్లో వస్తున్న యువకులపై పోలీసులు నిఘా ఉంచారు. యువకులు బైక్ ర్యాలీగా బయలుదేరుతారనే అనుమానంతో.. పోలీసులు వాహనాల తనీఖీలు చేపట్టారు. రావులపాలెంతో పాటు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో బైక్‌లను పోలీస్ స్టేషన్‌

మరోవైపు.. కోనసీమలో పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ (ap dgp) కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి (kasireddy rajendranath reddy) సమీక్ష చేపట్టారు. ఏలూరు రేంజ్ డీఐజీ, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్న అమలాపురంలో చోటుచేసుకున్న విధ్వంసం, ప్రస్తుతం అక్కడున్న పరిస్థితుల గురించి డీజీపీ ఆరా తీశారు. ఆ తర్వాత ఓ తెలుగు న్యూస్ చాన‌ల్‌తో డీజీపీ మాట్లాడుతూ.. కొనసీమకు అదనపు బలగాలను తరలించడం జరిగిందన్నారు. 2000 మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చెప్పారు. గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 7 కేసులు నమోదు చేసినట్టుగా తెలిపారు. 

ప్రస్తుతం కొనసీమలో (konaseema district) పరిస్థితి అదుపులోనే ఉందని డీజీపీ చెప్పారు. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. నిన్న హింసాత్మక ఘటనలకు పాల్పడిన 72 మందిని గుర్తించామని చెప్పారు. ఇప్పటివరకు 46 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నగరంలోని రౌడీ షీటర్లను కూడా అదుపులోకి తీసుకుంటున్నట్టుగా చెప్పారు. పోలీసులు సంయమనం పాటించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నారని తెలిపారు. 

కొనసాగుతున్న టెన్షన్..
ప్రస్తుతం కోనసీమలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. అమలాపురం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ పికెట్లను ఏర్పాట్లు చేశారు. నిన్నటి ఘటనల దృష్ట్యా కొనసీమకు ఇతర జిల్లాల నుంచి కూడా బలగాలను రప్పించారు. సున్నితమైన ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించే బాధ్యతలను సీనియర్ ఐపీఎస్‌లకు బాధ్యతలు అప్పగించారు. కోనసీమలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఏలూరు డీఐజీ పాలరాజు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మళ్లీ ఆందోళనలు జరిగే అవకాశం ఉండొచ్చనే అనుమానంతో.. అమలాపురం మొత్తం పోలీసుల నిఘా నీడలోకి వెళ్లింది. 

అమలాపురం డిపో నుంచి సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. అలాగే కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమకు బస్సు సర్వీసులు రద్దు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అమలాపురం వచ్చే బస్సులను కూడా నిలిపివేశారు. ఇక, ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కోనసీమ జిల్లా సాధనసమితి చలో రావులపాలెంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu