సగం మంది జైల్లోనే... చంద్రబాబుకు మాట్లాడుకోవడానికి మనుషులు లేరు: పేర్ని నాని

By Siva KodatiFirst Published Aug 18, 2020, 7:05 PM IST
Highlights

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి పేర్ని నాని. బాబు మానసిక స్థితి బాలేదని... వాళ్లు మాట్లాడుకునే మాటల్లో ఏం వుందని తాము వినాలని ఆయన ప్రశ్నించారు. 

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి పేర్ని నాని. బాబు మానసిక స్థితి బాలేదని... వాళ్లు మాట్లాడుకునే మాటల్లో ఏం వుందని తాము వినాలని ఆయన ప్రశ్నించారు.

అసలు మాట్లాడుకోవడానికి చంద్రబాబు దగ్గర మనుషులు ఉన్నారా అని ఆయన నిలదీశారు. బాబు మనుషుల్లో సగం మంది జైల్లోనే ఉన్నారని.. ప్రధానికి లేఖ రాయడం చంద్రబాబు బాధ్యతారాహిత్యమని పేర్ని నాని దుయ్యబట్టారు.

ఆధారాలు ఉంటే చూపించాలని, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 175 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబు ఒక ఎమ్మెల్యే మాత్రమే అన్నారు. బాబు లేఖ రాశారంటే ఆధారాలు ఉన్నాయేమోనని, వాటిని ఇమ్మని డీజీపీ కూడా అడిగారని నాని చెప్పారు.

Also Read:ఫోన్ ట్యాపింగ్ వైసీపీకి కొత్త కాదు: డీజీపీ లేఖపై బాబు స్పందన ఇదీ

కాగా, ఫోన్ ట్యాపింగ్ పై  ఆధారాలు ఇవ్వాలని డిజిపి లేఖ రాయడం విడ్డూరమని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రధానికి నేను లేఖ రాస్తే డిజిపి హుటాహుటిన స్పందించడం విచిత్రంగా ఉందన్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాల నాయకులపై దాడులు-దౌర్జన్యాలు, తప్పుడు కేసులపై గతంలో ఇచ్చిన వినతులు, రాసిన లేఖలపై డిజిపి ఏం చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. వైసిపి తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందన్నారు.

రాష్ట్రంలోని  వ్యవస్థలన్నీఉన్మాదంతో ధ్వంసం చేస్తోందని ఆయన వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. టిడిపి ప్రజా ప్రతినిధులు, అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధులు పార్టీ సీనియర్ నేతలతో మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిడిపిపై తప్పుడు ప్రచారంతో వైసిపి అధికారంలోకి వచ్చింది. అదే తప్పుడు ప్రచారాన్ని గత 15నెలలుగా కొనసాగిస్తోందన్నారు

click me!