కేసీఆర్ వ్యాఖ్యలకే స్పందించా, కొత్త పార్టీ ఎందుకు: రేవంత్ రెడ్డికి పేర్ని నాని కౌంటర్

By narsimha lodeFirst Published Oct 29, 2021, 5:09 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలకే తాను స్పందించానని చెప్పారు. కొత్తగా పార్టీ ఎందుకు అసెంబ్లీ తీర్మానం చేస్తే సరిపోతోందన్నారు.
 

అమరావతి: టీపీసీసీ చీఫ్ Revanth Reddy ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలకు ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి Perni Nani కౌంటరిచ్చారు. శుక్రవారం నాడు ఆయన  అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ కు ప్రతిరోజూ రాజకీయాలు కావాలని  పేర్నినాని ఎద్దేవా చేశారు.  తెలంగాణ సీఎం Kcr వ్యాఖ్యలపై తాను స్పందించినట్టుగా పేర్ని నాని తెలిపారు. సీఎం Ys Jagan డొంకతిరుగుడుగా మాట్లాడారని ఆయన చెప్పారు.  ఏదైనా జగన్ ముక్కుసూటిగానే మాట్లాడుతారని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు.  నోటితో నవ్వి నొసటితో వెక్కించవద్దని తాను కోరుకొంటున్నానని నాని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానంగా Telangana Assemblyలో తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయన్నారు. మళ్లీ కొత్త పార్టీ ఎందుకో చెప్పాలని  పేర్ని నాని ప్రశ్నించారు.

also read:ఏపీలో పార్టీ పెట్టడం ఎందుకు .. రెండు రాష్ట్రాలను కలిపేస్తే పోలా : కేసీఆర్ వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ టీఆర్ఎస్ ను ఏర్పాటు చేయాలని తనను చాలా మంది కోరుతున్నారని Trs Plenary సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. Dalitha Bandhu అమలు చేసిన తర్వాత ఈ వినతులు ఎక్కువయ్యాయన్నారు. ఈ వ్యాఖ్యలపై  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy తొలుత వ్యాఖ్యానించారు.  ఏపీలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తే ఎవరైనా వద్దన్నారా అని ఆయన ప్రశ్నించారు. మరో వైపు ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు.. ఎక్కడైనా పోటీ చేయవచ్చని చెప్పారు.

ఈ నెల 28వ తేదీన ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్నినాని స్పందించారు. రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని తమ పార్టీ అభిమతంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోంది.

ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం…మంత్రి పేర్ని నానీ “సమైక్య రాష్ట్ర”
ప్రతిపాదన తేవడం…
కేసీఆర్, జగన్ ల “ఉమ్మడి” కుట్ర.
వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్…! pic.twitter.com/Is4fDy8Okk

— Revanth Reddy (@revanth_anumula)

 

ఈ వ్యాఖ్యలపై అదే రోజున టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలి ఇచ్చే కుట్ర జరుగుతోందన్నారు. ప్లీనరీలో తెలంగాణ తల్లి ప్రత్యక్షం కావడం ఏపీ మంత్రి పేర్నినాని సమైఖ్య రాష్ట్రం ప్రతిపాదన తేవడం కేసీఆర్, జగన్ ఉమ్మడి కుట్రగా ఆయన అభివర్ణించారు.వందలాది మంది ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అని రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్నినాని స్పందించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చకు దారితీసింది. రెండు రాష్ట్రాల్లో కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత ఇతర పార్టీల నేతలు కూడా స్పందిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కీలక నేతలు ఈ విషయమై స్పందించారు. మరో వైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈ విషయమై స్పందించడంతో తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ విషయమై చర్చకు తెరతీసినట్టైంది.
 


 

click me!