బీజేపీ చేసే ప్రతి దాన్నీ ఒప్పుకోవటానికి తాము డూడూ బసవన్నల౦ కాదని జనసేన (janasena) నేత శివశంకర్ (shivsankar) వ్యాఖ్యానించారు. తమ సిద్ధాంతాలు తమకుంటాయని.. వాళ్ల సిద్ధాంతాలు వాళ్లకు౦టాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీతో తాము పెట్టుకున్నది కేవలం ఎన్నికల పొత్తు మాత్రమేనని శివశంకర్ స్పష్టం చేశారు.
బీజేపీ చేసే ప్రతి దాన్నీ ఒప్పుకోవటానికి తాము డూడూ బసవన్నల౦ కాదని జనసేన (janasena) నేత శివశంకర్ (shivsankar) వ్యాఖ్యానించారు. తమ సిద్ధాంతాలు తమకుంటాయని.. వాళ్ల సిద్ధాంతాలు వాళ్లకు౦టాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీతో తాము పెట్టుకున్నది కేవలం ఎన్నికల పొత్తు మాత్రమేనని శివశంకర్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ వైఖరిని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు ఈనెల 31న జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ వస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కూర్మన్నపాలెం జంక్షన్లోని దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యమానికి మద్దతు తెలియజేయస్తారని శివశంకర్ వెల్లడించారు. అనంతరం జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారని ఆయన చెప్పారు.
జనసేన పార్టీ ముందు నుంచీ ఉక్కు ఉద్యమంలో ఉందని శివశంకర్ గుర్తుచేశారు. ప్రయివేటీకరణ నిర్ణయం వెలువడిన వెంటనే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసినట్లు గుర్తుచేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర పెద్దలను కోరినట్లు ఆయన వివరించారు. ఇది ఒక సామాజిక అంశమో..వ్యాపార అంశమో..రాజకీయ అంశమో కాదని శివశంకర్ తెలిపారు. పవన్ కల్యాణ్ సభ నేపథ్యంలో తమ వైపు నుంచి పోలీసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 500 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చామని ఆయన వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా మీటింగ్ నిర్వహిస్తామన్నారు. పవన్ పర్యటనకు పోలీసులు తొందరగా అనుమతులు ఇచ్చినట్లయితే తాము ఏర్పాట్లు చేసుకుంటామన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ నార్కోటిక్స్ హబ్‌గా మారిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇటీవల ఆరోపించారు. ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోందని మండిపడ్డారు. ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతుందంటూ తెలంగాణ పోలీసులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. తన పోరాట యాత్ర సమయంలో ఏవోబీలో గంజాయి వ్యాపారం, మాఫియా గురించి తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయని కూడా పవన్ కల్యాణ్ తెలిపారు. వరసు ట్వీట్‌లతో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
‘ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారింది & ప్రతి స్థాయిలో చాలా మంది డ్రగ్స్ లార్డ్‌లతో నిండిపోయింది. ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు’ అని పవన్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ చెప్పిన మాటలు చూడండి అంటూ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ.. గంజాయి AOB ప్రాంతం నుంచి దేశంలోని చాలా ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. అది వేల కోట్ల బిజినెస్ అని తెలిపారు.