సినీ నటుడు మోహన్‌బాబుతో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీ: టాలీవుడ్ సమస్యలపై చర్చ

Published : Feb 11, 2022, 02:34 PM ISTUpdated : Feb 11, 2022, 03:45 PM IST
సినీ నటుడు మోహన్‌బాబుతో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీ: టాలీవుడ్ సమస్యలపై చర్చ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని మోహన్ బాబుతో శుక్రవారం నాడు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించారు.   

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Perni Nani ప్రముఖ సినీ నటుడు Mohan Babuతో శుక్రవారం నాడు Hyderabadలో  భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలపై పేర్ని నాని మోహన్ బాబుతో చర్చించారు.

chiranjeevi నేతృత్వంలోని బృందం  ఏపీ సీఎం YS Jagan తో గురువారం నాడు భేటీ అయింది. ఈ భేటీకి మోహన్ బాబు హాజరు కాలేదు. దీంతో మోహన్ బాబుతో మంత్రి పేర్ని నాని భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ నెలాఖరులోపుగా సినీరంగ ప్రముఖులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన అంశాలపై  ప్రభుత్వం జీవోలు జారీ చేయనుంది. ఇదే విషయాన్ని ఏపీ  సీఎం జగన్ నిన్ననే ప్రకటించారు.

మా అసోసియేషన్ అధ్యక్షుడుగా  మోహన్ బాబు తనయుడు విష్ణు ఇటీవల ఎన్నికయ్యారు. ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి భేటీ కావడంపై Vishnu ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ భేటీ వ్యక్తిగతమైందిగా పేర్కొన్నారు. నిన్న సీఎంతో జరిగిన సమావేశానికి చిరంజీవి సహా పలువురు నటులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందన్నారు.గత ఐదారు నెలలుగా ఉన్న గందరగోళానికి తెరపడిందని సినీ ప్రముఖులు ప్రకటించారు. సినీ పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడుతుందని తాను భావిస్తున్నానని చిరంజీవి నిన్ననే ప్రకటంచిన విషయం తెలిసిందే 

చిన్న సినిమాలు ఐదవ షోకి కూడా ప్రభుత్వం అంగీకరించిందని చిరంజీవి చెప్పారు. ప్రజలు, సినీ పరిశ్రమ కూడా సీఎం జగన్ తీసుకొన్న నిర్ణయం పట్ల సంతృప్తి చెందుతారని చిరంజీవి అభిప్రాయపడ్డారు.  సినిమా టికెట్ ధరలపై కొన్ని నెలలుగా ఉన్న అనిశ్చిత పరిస్థితులకు శుభం కార్డు పడిందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని చిరంజీవి చెప్పారు.  చిన్న సినిమాలకు కూడా మేలు చేకూరేలా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. చర్చలకు మమ్మల్ని ఆహ్వానించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. పాన్ ఇండియా సినిమాల విషయంలో ఏం చేయాలనే దానిపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సీఎం చెప్పారని చిరంజీవి వివరించారు.

సినీ పరిశ్రమ తరపున ప్రభుత్వంతో చర్చలను నిర్వహించిన చిరంజీవికి తొలుత ధన్యవాదాలు చెబుతున్నానని ప్రముఖ నటుడు మహేష్ బాబు చెప్పారు. ఈ చర్చలతో తమందరికీ ఓ దారి చూపారని Mahesh Babu తెలిపారు.ఆరేడు నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ గందరగోళంలో ఉందని చెప్పారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో సినీ పరిశ్రమకు పెద్ద రిలీఫ్ అని మహేష్ బాబు అభిప్రాయపడ్డారు.చిరంజీవితో పాటు ఈ విషయమై ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని కూడా చొరవ చూపారని  మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. వారం లేదా పదిరోజుల్లో అందరూ శుభవార్త వింటారని మహేష్ బాబు చెప్పారు.

చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో పాటు నిర్మాతల సమస్యలను సీఎం జగన్ ఓపికగా విన్నారని ప్రముఖ దర్శకుడు రాజమౌళి చెప్పారు. సినిమా పరిశ్రమ ఎలా ముందుుకు వెళ్లాలనే దానిపై సీఎం జగన్ దిశా నిర్ధేశం చేశారని  Rajamouli చెప్పారు. .సినీ పరిశ్రమ సమస్యలపై ఎటు వెళ్లాలనే దానిపై ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసినప్పటికీ  చిరంజీవి  ఈ అంశాన్ని తన భుజానికెత్తుకొని సక్సెస్ అయ్యేలా చేశారన్నారు

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్