మా ఎన్నికలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీ రాష్ట్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని సోమవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలతో తమకు సంబంధ: లేదని మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పారు.
అమరావతి: మా ఎన్నికలతో (maa elections) మాకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ రాష్ట్ర సమాచార ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని (perni nani)చెప్పారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.మా ఎన్నికలపై మాకు ఉత్సాహం లేదని ఆయన తేల్చి చెప్పారు.వైసీపీకి(ycp) గానీ, సీఎం జగన్ కు(ys jagan) గానీ మా ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
మా ఎన్నికల్లోకి వైఎస్ జగన్ ను, కేసీఆర్ ను, బిజెపిని లాగుతారా అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ బంధువైతే మా ఎన్నికలకు వస్తారా అని ఆయన ప్రశ్నించారు రెండు సార్లు హలో చెప్పినంత మాత్రాన కేటీఆర్ మిత్రుడైపోతారా అని కూడా అడిగారు. ఓట్ల సునామీలో మంచు విష్ణు ప్యానెల్ కొట్టుకుపోతుందని ఆయన అన్నారు. ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పేర్ని నాని స్పందించారు.
undefined
వైఎస్ జగన్ తమకు బంధువు అని, కేటీఆర్ తో తనకు స్నేహం ఉందని మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న మంచు విష్ణు అన్నారు. దానిపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. జగన్ కు, కేటీఆర్ కు ఇంకేమీ పనిలేదా అని కూడా అడిగారు.
ఈ నెల 10వ తేదీన మా ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను సినీ పరిశ్రమ (tolly wood) వర్గాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ లు పోటీ చేస్తున్నాయి.
అయితే ప్రకాష్ రాజ్(prakash raj) ప్యానెల్ కు సినీ నటుడు చిరంజీవి (chiranjeevi)మద్దతు ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని నాగబాబు కూడ ప్రకటించారు. మరో వైపు మంచు విష్ణు ప్యానెల్ కి బాలకృష్ణ (bala krishna)మద్దతు ప్రకటించారు.ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా మంచు విష్ణు ప్రకటించారు.
మా ఎన్నికలకు సంబంధించి రెండు ప్యానెల్ సభ్యులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండు ప్యానెల్ సభ్యులు కూడ తమ ప్యానెల్ ను గెలిపించాలని కోరుతూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. మరో వైపు పరస్పరం విమర్శలు కూడ చేసుకొంటున్నాయి.