బద్వేల్‌లో మా పార్టీ అభ్యర్ధికి ప్రచారం చేయాలని పవన్ ను కోరుతాం: సోము వీర్రాజు

Published : Oct 04, 2021, 02:42 PM ISTUpdated : Oct 04, 2021, 02:48 PM IST
బద్వేల్‌లో మా పార్టీ అభ్యర్ధికి ప్రచారం చేయాలని పవన్ ను కోరుతాం: సోము వీర్రాజు

సారాంశం

బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధి తరపున ప్రచారానికి రావాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను కోరుతామని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పారు. జనసేనకు చెందిన విధానపరమైన నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేది తమ పార్టీ విధాన నిర్ణయంగా తెలిపారు.

హైదరాబాద్: బద్వేల్ అసెంబ్లీ (Badvel bypoll)స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధి తరపున ప్రచారం కోసం పవన్ కళ్యాణ్  (pawan kalyan)రావాలని ఆహ్వానిస్తామని బీజేపీ  (bjp)ఏపీ  చీఫ్ సోము వీర్రాజు (somu Veerraju)చెప్పారు.

also read:పవన్ బాటలో.. బద్వేల్ ఉపఎన్నిక బరి నుంచి తప్పుకున్న టీడీపీ

ఓ తెలుగు న్యూస్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.ఈ స్థానం నుండి పోటీకి దూరంగా ఉంటామని జనసేన (jana sena)ప్రకటించింది. కులాలను రాజకీయాల్లోకి లాగొద్దని  సోము వీర్రాజు  కోరారు.

బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని  పవన్ కళ్యాణ్ జనసేన విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించిందని ఆయన చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తమ పార్టీ విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించిందని సోము వీర్రాజు చెప్పారు.

టీడీపీకి (tdp)జనసేన దగ్గర అవుతోందనే ప్రచారంపై తాను స్పందించనని ఆయన చెప్పారు.జనసేన, బీజేపీ మధ్య బిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని, బేదాభిప్రాయాలు కావని సోము వీర్రాజు తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే విషయమై బీజేపీతో చర్చించారా అనే విషయమై స్పందించడానికి సోము వీర్రాజు నిరాకరించారు.

బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ స్థానం నుండి పోటీ చేసే విషయమై జనసేన, బీజేపీల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ స్థానం నుండి పోటీకి దూరంగా ఉంటామని జనసేన అనూహ్య నిర్ణయం తీసుకోవడం బీజేపీలో కలకలం రేపింది. దీంతో  బద్వేల్ లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్