గోవులను అతి దారుణంగా ఈడ్చుకెళుతూ... పలాస మున్సిపల్ సిబ్బంది అమానుషం (వీడియో)

Published : Oct 04, 2021, 01:39 PM ISTUpdated : Oct 04, 2021, 01:42 PM IST
గోవులను అతి దారుణంగా ఈడ్చుకెళుతూ... పలాస మున్సిపల్ సిబ్బంది అమానుషం (వీడియో)

సారాంశం

మూగజీవుల పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించిన పలాస మున్సిపల్ సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అమరావతి: మూగ జీవాలపై ప్రేమ లేకపోగా కనీసం కనికరం కూడా చూపించలేదు శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ అధికారులు. రోడ్డుపై తిరుగుతూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నాయంటూ గోవులను ఓ ట్రాక్టర్ కు కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు మున్సిపల్ సిబ్బంది. మూగజీవాలపై ఇలా అమానుషంగా ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వీడియో

గోవులను ఇలా ట్రాక్టర్ కి కట్టేసి తరలిస్తున్న మున్సిపల్ సిబ్బంది తీరుపై స్థానికులు, జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. అత్యంత కర్కశంగా గోవుల తరలించడాన్ని అడ్డకున్న స్థానికులు మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పలాసలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటనపై ప్రజలు, జంతు ప్రేమికుల ఆగ్రహానికి కారణమవుతోంది.  

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu