
అమరావతి:చిన్నారిపై లైంగిక వేధింపులను లోకేష్ సమర్ధిస్తున్నాడా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు చదువుకొన్న రాజకీయ స్కూల్ లోనే లోకేష్ కూడ చదువుకొన్నాడని ఆయన ఆరోపించారు.
ఉదాత్తమైన రాజకీయాలు లోకేష్‌చేస్తాడని ఎవ్వరూ అనుకోరన్నారు. అబద్ధాలు, విషప్రచారాలు, ఆధారాల్లేని ఆరోపణలతో చంద్రబాబునాయుడు రాజకీయంగా ఎదిగాడన్నారు. ఇదే దారిలో లోకేష్ ను నడిపిస్తున్నాడన్నారు.
చంద్రబాబునాయుడు, లోకేష్ వ్యవహరశైలి రాష్ట్రానికి శాపమన్నారు. చిత్తూరులో ఒకరి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడిచేసిన ఘటనను తనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబే కాదు.. లోకేష్‌బుర్రకూడా విషంతో నిండిపోయిందని ఆయన ఆరోపించారు. ఒక చిన్నారిని లైంగికంగా వేధించిన కేసులో ఒక హెడ్‌మాస్టర్‌పై చట్టప్రకారం చర్య తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ వ్యవహారంలో సంబంధిత పత్రికా విలేఖరి వ్యవహారం నడపాలని చూస్తే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహించి దాడికి దిగారన్నారు. పోలీసులు చర్య తీసుకుని, దాడికి దిగిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారన్నారు.
ఈ వ్యవహారాన్ని తనపై రుద్దడం అవివేకమన్నారు. లోకేష్... మీ తండ్రి ఎలాంటి రాజకీయాలు చేశారో, దాని ఫలితం ఏంటో.. ఇవాళ చూస్తున్నారన్నారు. పరనిందలు, ఆధారాల్లేని ఆరోపణలతో ట్వీట్లు మీద ట్వీట్లు పెట్టే మీ శైలేంటో ప్రజలకు మీరే చెప్పుకుంటున్నారని ఆయన చెప్పారు.
ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే... తండ్రీ కొడుకులిద్దరికీ ప్రజలు బడితె పూజ చేస్తారన్నారు.