రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే: జగన్ సర్కార్ కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published Aug 31, 2020, 3:17 PM IST
Highlights

రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. భూ వివాదాలను పరిష్కారించే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.


అమరావతి: రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. భూ వివాదాలను పరిష్కారించే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

2021 జనవరి 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే నిర్వహించాలని సీఎం అదికారులను ఆదేశించారు. 2023 ఆగష్టు నాటికి సర్వేను పూర్తి చేయాలని ఆయన కోరారు.  అర్భన్ ప్రాంతాల్లో కూడ సమగ్ర భూ సర్వే కోసం  సర్వే బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. భూ వివాదాలను ఎక్కడికక్కడే పరిష్కరించేందుకు వీలుగా మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు.

భూ సమగ్ర సర్వే కోసం గ్రామ సభల ద్వారా ప్రజల్లో ఈ విషయమై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించను్నారు. సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు ఉపయోగించనున్నారు. సర్వే చేసిన తర్వాత సర్వే రాళ్లను ఏర్పాటు చేయనున్నారు. సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తారు. 

తెలంగాణ రాష్ట్రంలో కూడ గతంలో భూముల సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా పట్టాదారు పాసు పుస్తకాలు, రికార్డులు తయారు చేశారు.

click me!