చంద్రబాబుకు ప్రజలు రాజకీయ సమాధి కడతారు: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Published : Jan 16, 2023, 05:55 PM IST
చంద్రబాబుకు  ప్రజలు రాజకీయ సమాధి కడతారు: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సారాంశం

కుప్పంలో  చంద్రబాబునాయుడు  ఓడిపోవడం ఖాయమని  ఏపీ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. 

చిత్తూరు: చంద్రబాబుకు  ప్రజలు రాజకీయ సమాధి కడతారని  ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  చెప్పారు.సోమవారం నాడు  ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  చిత్తూరులో  మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు  రాజకీయ భవిష్యత్తును  ప్రజలు ఎప్పుడో చింపేశారన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితి లేదన్నారు.  కుప్పంలో  వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన  ధీమాను వ్యక్తం చేశారు. కుప్పంలో టీడీపీ జెండా పీకేడం ఖాయమన్నారు. బాబు కుట్రలను  కుప్పం ప్రజలు ఎప్పుడో అర్ధం చేసుకున్నారని  మంత్రి తెలిపారు.  రాష్ట్రంలో  ప్రజలంతా  తమ పక్షానే ఉన్నారని  మంత్రి చెప్పారు. బాబు పని ఎప్పుడో  అయిపోయిందన్నారు. 

చంద్రబాబు ప్రజాకంటక పాలన సాగించారన్నారు.  అలాంటి చంద్రబాబునాయుడు  ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హస్యాస్పదంగా  ఉందని  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.పండగపూట చంద్రబాబునాయుడు  రాజకీయాలు  చేస్తున్నారని  పెద్దిరెడ్డి విమర్శించారు.  చంద్రబాబును  చిత్తూరు  జిల్లా ప్రజలు ఏనాడూ విశ్వసించబోరని మంత్రి పెద్దిరెడ్డి  చెప్పారు. 

also read:మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు తప్పిన ప్రమాదం: ఎంపీ వ్యక్తిగత సిబ్బందికి గాయాలు

ప్రజల సంక్షేమం కోసం జగన్  పాలన చేస్తున్నాడన్నారు.  తమ ప్రభుత్వంపై  అసత్య ప్రచారం చేయడమే అజెండాగా  చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు.  ఇష్టమొచ్చినట్టుగా  కారుకూతలు కూయడమే బాబు పనిగా  పెట్టుకున్నారన్నారు. ఇవాళ  పీలేరు  సబ్ జైలులో  టీడీపీ కార్యకర్తలతో  చంద్రబాబు  ములాఖత్ అయ్యారు. రాస్ట్రప్రభుత్వం తీరుపై  మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డిపై  విమర్శలు గుప్పించారు.  వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు.  తమ పార్టీ కార్యకర్తలపై  అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు. చంద్రబాబు చేసిన విమర్శలపై  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మండిపడ్డారు.

 


 

PREV
click me!

Recommended Stories

జగన్ రాకతో కర్నూలులో స్తంభించిన ట్రాఫిక్ | YS Jagan Kurnool tour | Asianet News Telugu
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడలో రిహార్సిల్స్ | Independence Day rehearsals