మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు తప్పిన ప్రమాదం: ఎంపీ వ్యక్తిగత సిబ్బందికి గాయాలు

Published : Jan 16, 2023, 02:28 PM IST
  మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు  తప్పిన ప్రమాదం: ఎంపీ వ్యక్తిగత సిబ్బందికి గాయాలు

సారాంశం

అన్నమయ్య  జిల్లాలోని  రాయచోటి  మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్ పై  జరిగిన  రోడ్డుప్రమాదంలో  మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు  తృటిలో తప్పించుకున్నారు.

చిత్తూరు: అన్నమయ్య  జిల్లాలోని  రాయచోటి మండలం చెన్నముక్కపల్లె  రింగ్ రోడ్  పై  సోమవారం నాడు  జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఏపీ మంత్రి  పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ  మిథున్ రెడ్డిలు తృటిలో  ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎంపీ మిథున్ రెడ్డి వ్యక్తిగత  సిబ్బంది గాయపడ్డారు.

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ మిథున్ రెడ్డిలు  ఒకే కారులో  బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.   మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  కాన్వాయ్ లోని  వాహనాన్ని  ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి కాన్వాయ్ లోని కారు  పల్టీలు కొట్టింది. కారులో ఉన్న  మిథున్  రెడ్డి  వ్యక్తిగత కార్యదర్శి,  భద్రత సిబ్బందికి గాయాలయ్యాయి.  వీరిని చికిత్స నిమిత్తం  రాయచోటి  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.   ఈ ప్రమాదంలో  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ఎంపీ మిథున్ రెడ్డిలు  ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్