ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో3,263 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 28వేల 664 కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో3,263 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 28వేల 664 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో 11 మంది మరణించారు. కరోనాతో చిత్తూరులో ఐదుగురు చనిపోయారు. నెల్లూరులో ఇద్దరు మరణించారు. అనంతపురం, కడప, కర్నూల్, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కరి చొప్పున మృతి చెందారు. .దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,311 కి చేరుకొంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,54,53,146 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 33,755 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో3,263మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 1,091 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 98 వేల 238 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 23,115 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
undefined
గత 24 గంటల్లో అనంతపురంలో 116, చిత్తూరులో 654,తూర్పుగోదావరిలో 134,గుంటూరులో 418, కడపలో 259,కృష్ణాలో 318, కర్నూల్ లో 176, నెల్లూరులో 245,ప్రకాశంలో 107, శ్రీకాకుళంలో 280, విశాఖపట్టణంలో 454, విజయనగరంలో 083,పశ్చిమగోదావరిలో 019కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -69,656 మరణాలు 610
చిత్తూరు -94,814,మరణాలు 892
తూర్పుగోదావరి -1,25,951, మరణాలు 637
గుంటూరు -82,461, మరణాలు 686
కడప -57,125 మరణాలు 465
కృష్ణా -53,135,మరణాలు 691
కర్నూల్ -63,239, మరణాలు 501
నెల్లూరు -65,258,మరణాలు 523
ప్రకాశం -63,842, మరణాలు 589
శ్రీకాకుళం -48,319,మరణాలు 350
విశాఖపట్టణం -65,162,మరణాలు 587
విజయనగరం -42,053, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,754, మరణాలు 542
: 12/04/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,25,769 పాజిటివ్ కేసు లకు గాను
*8,95,343 మంది డిశ్చార్జ్ కాగా
*7,311 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 23,115 pic.twitter.com/0REURVgmBk