AP Corona : ఏపీలో క‌రోనా టెర్ర‌ర్.. ఒకే రోజులో 12,926 కేసులు, ఆరు మరణాలు

By Rajesh K  |  First Published Jan 22, 2022, 6:15 PM IST

AP Corona : ఆంధ్ర‌ప్ర‌దేశ్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 43,763 శాంపిల్స్ పరీక్షించగా 12,926 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
 


AP Corona :  ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 43,763 శాంపిల్స్ పరీక్షించగా 12,926 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి ఏపీ వైద్యారోగ్య అధికారులు సూచిస్తోన్నారు. 

గ‌త‌వారంలో ఐదు వేలు, ఆరు వేలు న‌మోదు అయినా కేసులు సంక్రాంతి   తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా ఈరోజు 43,763 శాంపిల్స్‌ను పరీక్షించగా 12,926 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఇందులో అత్య‌ధికంగా.. విశాఖ జిల్లాలో 1,959 కేసులు న‌మోదు కాగా..  చిత్తూరు జిల్లాలో 1,566 కేసులు, అనంతపురం జిల్లాలో 1,379 కేసులు, గుంటూరు జిల్లాలో 1,212 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,001 కేసులు న‌మోద‌న‌ట్టు ఆర్యోగ నిపుణులు వెల్లడించారు. ఇతర జిల్లాల్లోనూ అదే స్థాయిలో కొత్త కేసులు గుర్తించారు.

Latest Videos

undefined

ఇదే స‌మ‌యంలో కరోనాతో ఈ రోజు ఆరుగురు మృతి చెందారు. కరోనా కారణంగా  విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒకరు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14538కు చేరింది.


ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 73,143 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 3,913 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. తాజా రిక‌వ‌రీల‌తో మొత్తం రికవరీల సంఖ్య  20, 78 , 513కి చేరింది. నేటి వరకు ఏపీలో 3,21,00,381 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని తెలిపారు.

click me!