భార్యతో ఆలయాలకు వెళ్లాలని మోడీకి చెప్పండి: మంత్రి కొడాలి నాని

By narsimha lodeFirst Published Sep 23, 2020, 3:26 PM IST
Highlights


ప్రధాని నరేంద్ర మోడీ సతీసమేతంగా ఆలయాలకు వెళ్లాలని చెప్పాలని బీజేపీ నేతలకు మంత్రి కొడాలి నాని సూచించారు.


తిరుమల: ప్రధాని నరేంద్ర మోడీ సతీసమేతంగా ఆలయాలకు వెళ్లాలని చెప్పాలని బీజేపీ నేతలకు మంత్రి కొడాలి నాని సూచించారు.

బుధవారం నాడు ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమలలో మీడియాతో మాట్లాడారు. అయోధ్యతో పాటు ఇతర దేవాలయాలకు భార్యను తీసుకెళ్లి పూజలు చేయాలని మోడీకి చెప్పాలని బీజేపీ నేతలకు ఆయన హితవు పలికారు.

 మోడీ చేస్తున్న కార్యక్రమాలతో ఆయనను విమర్శించేందుకు ఎవరూ కూడ ముందుకు రారన్నారు. కానీ, కిందిస్థాయి వాళ్లు చేసే కార్యక్రమాలతో మోడీని విమర్శించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 

తిరుమల వెంకన్నను కూడ చంద్రబాబునాయుడు రాజకీయంగా వాడుకొన్నారని ఆయన మండిపడ్డారు. శ్రీవారి దయవల్లే జగన్ సీఎం అయ్యారని ఆయన స్పష్టం చేశారు. తిరుమలలో డిక్లరేషన్ ను తొలగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన చెప్పారు. 

also read:టెన్షన్ వాతావరణం: తిరుమలకు చేరుకొన్న మంత్రి కొడాలి నాని

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమించిన తర్వాతే రాష్ట్రంలో దేవాలయాల్లో దాడులు చోటు చేసుకొన్నాయని ఆయన ఆరోపించారు. తిరుమలలో డిక్లరేషన్ అంశాన్ని టీడీపీ అనవసరంగా వివాదం చేస్తోందని ఆయన మండిపడ్డారు.  దేవుడిని నమ్మని వ్యక్తులు దేవుడి వద్దకు ఎవరూ కూడ రారని ఆయన చెప్పారు.

డిక్లరేషన్ అంశాలు ఎందుకు వచ్చాయనే అంశంపై చర్చ జరగాలన్నారు. రాజకీయ ఉద్దేశ్యాలతో వివాదాలు సాగుతున్నాయన్నారు.  తిరుమల ఆలయం టీడీపీ, బీజేపీలకు చెందింది కాదన్నారు. దేవుడిపై తనకు భక్తి విశ్వాసాలు ఉన్నాయన్నారు.

click me!