టెన్షన్ వాతావరణం: తిరుమలకు చేరుకొన్న మంత్రి కొడాలి నాని

By narsimha lodeFirst Published Sep 23, 2020, 3:10 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని అధికారులకు సమాచారం ఇవ్వకుండానే బుధవారం నాడు తిరుమలకు చేరుకొన్నారు.తిరుమల డిక్లరేషన్  విషయంలో మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో  ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు వేడేక్కాయి.

 


తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని అధికారులకు సమాచారం ఇవ్వకుండానే బుధవారం నాడు తిరుమలకు చేరుకొన్నారు.తిరుమల డిక్లరేషన్  విషయంలో మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో  ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు వేడేక్కాయి.

also read:జగన్ మీద కుట్ర, కొడాలి నాని వంటివాళ్ల పాత్ర: పరిపూర్ణానంద

బుధవారం నాడు మధ్యాహ్నం మంత్రి నాని  నేరుగా తిరుమలకు చేరుకొన్నారు. అధికారులకు  సమాచారం ఇవ్వకుండానే తిరుమలకు చేరుకోవడం సర్వత్రా చర్చకు దారి తీసింది. 

తిరుమల డిక్లరేషన్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతకం చేయాల్సిన అవసరం లేదని కొడాలి నాని ప్రకటించారు. తిరుమలలో డిక్లరేషన్ ను ఎత్తివేయాలని కూడ డిమాండ్ చేశారు. దేవాలయాల్లో చోటు చేసుకొన్న ఘటనలపై మంత్రి నాని చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని  సీఎం వైఎస్ జగన్ వెంకటేశ్వరస్వామికి ఇవాళ సాయంత్రం పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.సీఎం జగన్ తిరుమల పర్యటనను పురస్కరించుకొని టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

click me!