టచ్ చేసి చూడండి: భావోద్వేగానికి గురైన కొడాలి నాని

By narsimha lodeFirst Published Sep 23, 2020, 4:28 PM IST
Highlights

తిరుమల డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై ఏపీ మంత్రి కొడాలి నాని భావోద్వేగానికి గురయ్యారుబుధవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఏపీ మంత్రి కొడాలి నాని కంటతడి పెట్టుకొన్నారు.

తిరుపతి:తిరుమల డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై ఏపీ మంత్రి కొడాలి నాని భావోద్వేగానికి గురయ్యారుబుధవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఏపీ మంత్రి కొడాలి నాని కంటతడి పెట్టుకొన్నారు.

తిరుమలలో డిక్లరేషన్ పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలనేది ఎవరు తెచ్చారు... ఎప్పుడు తెచ్చారు.. ఎందుకు తెచ్చారనే దానిపై చర్చ జరగాలన్నారు.

also read:భార్యతో ఆలయాలకు వెళ్లాలని మోడీకి చెప్పండి: మంత్రి కొడాలి నాని

కొడాలి నాని దిష్టిబొమ్మలను రోడ్లపై తగులేస్తే భయపడేవాడు ఎవడూ లేడన్నారు. ఎవరూ కూడ తనను టచ్ చేయలేరన్నారు. టచ్ చేస్తే ఏం చేయాలనేది తాను నిర్ణయం తీసుకొంటానని ఆయన హెచ్చరించారు.

తిరుమల వెంకన్నను వాడుకొంటే చంద్రబాబునాయుడు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందేనని ఆయన చెప్పారు.కుల, మతాలను చూడకుండా టీటీడీలో ఉద్యోగాలను నియమించారని ఆయన గుర్తు చేశారు. తిరుమల ఏడుకొండలు అని 2005 లో వైఎస్ఆర్ జీవో ఇచ్చారని ఆయన చెప్పారు. 1970లో తిరుమల రెండు కొండలు మాత్రమేనని కాంగ్రెస్ జీవో ఇచ్చిందన్నారు.

ఒక్కసారి అవకాశం ఇస్తే రెండు సార్లు ఓడిపోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ప్రజలతో ఛీ కొట్టించుకోవడం బాబుకు అలవాటుగా మారిందన్నారు.

ప్రజలు ఎలాగో టీడీపీ, బీజేపీలను పట్టించుకొనే పరిస్థితి లేదన్నారు. అందుకే దేవుడిని అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. దేవుడు కూడ వీళ్లను క్షమించరన్నారు.

తాను శాస్త్రాలు చదవలేదు.. జనాన్ని చదవలేదన్నారు. సమాజాన్ని చూసినట్టుగా ఆయన చెప్పారు. ప్రజల మన్ననలతో తాను వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టుగా ఆయన వివరించారు.

ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించినట్టుగా ఆయన గుర్తు చేశారు. తండ్రి తర్వాత కొడుక్కి పట్టు వస్త్రాలను  కల్పించే అవకాశం ఇచ్చినట్టుగా చెప్పారు.తాను ఏ తప్పు చేయలేదన్నారు. 

 


 

click me!