ఎవరెవరి వద్ద ఎంత కమిషన్ తీసుకున్నారో బయటకు వస్తుంది: బాబుకు ఐటీ నోటీసులపై కాకాని

By narsimha lode  |  First Published Sep 6, 2023, 12:04 PM IST

చంద్రబాబు ఎవరెవరి వద్ద తీసుకున్నారో  బయటకు వస్తుందని ఏపీ మంత్రి  కాకాని గోవర్థన్ రెడ్డి  చెప్పారు.



నెల్లూరు: చంద్రబాబు ఎవరెవరి వద్ద ఎంత తీసుకున్నారో అన్నీ బయటకు వస్తాయని ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పారు.బుధవారంనాడు ఆయన  అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఐటీ శాఖ షోకాజ్ నోటీసులతో చంద్రబాబు కమీషన్లు తీసుకున్నారని ప్రజలకు అర్ధమైందన్నారు. రాజధాని పేరుతో భారీగా ముడుపులు తీసుకున్నారని  చంద్రబాబుపై  మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపణలు చేశారు.
అన్ని వివరాలతోనే చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేసిందని ఆయన చెప్పారు.

ఐటీ నోటీసులతోనే అవినీతి జరిగిందని నిర్ధారణ అయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  జరిగిన పలు కార్యక్రమాల్లో చంద్రబాబునాయుడు ఎంత కమీషన్లు తీసుకున్నారో లెక్కలు తేలాలన్నారు.  చంద్రబాబు హయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని  తాము చేసిన ఆరోపణలకు ఐటీ నోటీసులే సాక్ష్యమన్నారు.

Latest Videos

undefined

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుకు  ఐటీ శాఖ షోకాజ్ నోటీసులు పంపిందని హిందూస్థాన్ టైమ్స్ పత్రిక  ఇటీవల కథనం ప్రచురించింది.ఈ కథనం ఆధారంగా  వైసీపీనేతలు  చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు.  చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో  అనేక అవకతవకలు జరిగాయని  వైసీపీ నేతలు , మంత్రులు  ఆరోపిస్తున్నారు.  తాజాగా ఐటీ శాఖ షోకాజ్ నోటీసు అంశాన్ని  ప్రస్తావిస్తూ తమ విమర్వల తీవ్రతను మరింత పెంచారు.  ఇదిలా ఉంటే  వైసీపీ నేతల విమర్శలపై  చంద్రబాబు నాయుడు స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు తనపై అనేక  కేసులు వేశారన్నారు . ఏ ఓక్క తప్పైనా నిరూపించారా అని  ఆయన ప్రశ్నిస్తున్నారు. 

also read:చంద్రబాబుకు ఐటీ నోటీసులు కేసులో కీలక పరిణామం : రంగంలోకి ఏపీ సీఐడీ.. రెండు స్కాంలు, డబ్బులు ఒక్కరికేనా..?

ఐటీ షోకాజ్ నోటీసుల అంశాన్ని వైసీపీ  నేతలు ప్రస్తావిస్తూ టీడీపీని రాజకీయంగా మరింత ఇబ్బంది పెట్టేందుకు  వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. అయితే  ఈ విషయమై  వైసీపీ ఆరోపణలను  తిప్పకొట్టేందుకు  టీడీపీ కూడ ప్రయత్నాలు ప్రారంభించింది.  ఇదిలా ఉంటే  ఐటీ షోకాజ్ నోటీసుల నేపథ్యంలో ఏపీ సీఐడీ కూడ రంగంలోకి దిగింది.  ఐటీ స్కాం, స్కిల్ డెవలప్ మెంట్ స్కాంల మూలాలు కూడ ఒకే చోట ఉన్నాయని సీఐడీ అనుమానిస్తుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలకంగా ఉన్న యోగేష్ గుప్తాకు  సీఐడీ అధికారులు  నిన్న నోటీసులు జారీ చేశారు.

 

 

click me!