ఎచ్చెర్ల వైసీపీలో విభేదాలు.. జెడ్పీ చైర్మన్ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే వర్గంపైనే ఆరోపణలు..

Published : Sep 06, 2023, 10:00 AM IST
ఎచ్చెర్ల వైసీపీలో విభేదాలు.. జెడ్పీ చైర్మన్ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే వర్గంపైనే ఆరోపణలు..

సారాంశం

ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.  జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా  ఆయన వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అదే పార్టీకి చెందిన ప్రత్యర్థి వర్గం చించివేసింది.

శ్రీకాకుళం: ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ నేత విజయనగరం జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అదే పార్టీకి చెందిన ప్రత్యర్థి వర్గం చించివేసింది. దీంతో ఎచ్చెర్ల వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి వెలుగుచూశాయి. వివరాలు.. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు సొంత పార్టీకే చెందిన ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము కిరణ్ కుమార్ విజయం కోసం ఎంతో కృషి చేశామని.. కానీ మండల స్థాయి పదవుల్లో తమకు తీరని అన్యాయం చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ‘జగన్‌ ముద్దు- కిరణ్‌ వద్దు’ అని ర్యాలీ కూడా నిర్వహించారు. 

రానున్న ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ లేదా మజ్జి శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే మజ్జీ శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా ఎచ్చెర్ల నియోజకర్గంలోని ఆయన అభిమానులు, మద్దతుదారులు.. ప్రధాన కూడళ్లలో, గ్రామాల్లో సోమవారం రాత్రి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఇది గమనించిన ఎమ్మెల్యే కిరణ్ వర్గీయులు అర్దరాత్రి వేళ ఆ ఫ్లెక్సీలను చించేశారు. 

ఇక, ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిని ఫ్లెక్సీ చించుతుండగా పట్టుకున్న మజ్జి శ్రీనివాసరావు అనుచరులు పోలీసులుకు అప్పగించారు. దీంతో పోలీసులు అతడిని విచారిస్తున్నారు. అతడు ఎమ్మెల్యే కిరణ్ వర్గానికి చెందినవాడని మజ్జి శ్రీనివాసరావు వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎచ్చెర్ల నుంచి మజ్జి శ్రీనివాసరావుకు వైసీపీ టికెట్ ఇస్తుందనే ప్రచారం నేపథ్యంలోనే కిరణ్ వర్గం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇదిలాఉంటే, తాజా ఘటనతో ఎచ్చెర్ల వైసీపీలో విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే చర్చ సాగుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం