నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహరం టీ కప్పులో తుఫాన్ వంటిదేనని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలియదని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. మంగళవారం నాడు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ లు జరగవన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహరం టీ కప్పులో తుఫాన్ వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయమై పార్టీ అధిష్టానం తనతో మాట్లాడలేదని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసి తనను అవమానించారన్నారు. తనకు అవమానం జరిగిన చోట తాను ఉండలేనన్నారు. గిరిధర్ రెడ్డిని వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దింపితే తాను పోటీచేయబోనన్నారు. వైసీపీ నాయకత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలకు గుడ్ బై చెబుతానని కూడా ఆయన తేల్చి చెప్పారు.
రెండు రోజుల క్రితం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కూడా శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఈ విషయం తనకు తెలుసునన్నారు.
undefined
also read:అలా అయితే రాజకీయాలకు గుడ్ బై చెబుతా:నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
తాను 12 సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నట్టుగా తెలిపారు. మంత్రి పదవిని ఆశించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సమయం వచ్చినప్పుడల్లా అధికారులపై, వైసీపీ నాయకత్వంపై శ్రీధర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో తన విమర్శల దాడిని మరింత పెంచారు.