అతి త్వరలోనే విశాఖకు పరిపాలనా రాజధానిని తరలిస్తామన్నారు. అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ మంత్రి జోగి రమేష్ చెప్పారు.
అమరావతి:అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ మంత్రి జోగి రమేష్ చెప్పారు. అతి త్వరలోనే విశాఖకు పరిపాలనా రాజధాని ఏర్పాటు కానుందన్నారు. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. ఈ తీర్పుపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. తాము చెబుతున్నది అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు.అభివృద్ధి వికేంద్రీకరణ చేయకపోతే భవిష్యత్తు తరాలు ఇబ్బందులు పడతాయన్నారు.అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ,ఉత్తరాంధ్రలో ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.చట్ట ప్రకారమే అభివృద్ది వికేంద్రీకరణ ప్రక్రియ అని మంత్రి తెలిపారు. ఐదు కోట్ల ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందన్నారు.ప్రజల అభీష్టానికి అనుగుణంగానే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని మంత్రి జోగి రమేష్ చెప్పారు.
also read:మూడు రాజధానులకు మద్దతుగా డిసెంబర్ 5న భారీ సభ: సజ్జల
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో శంకుస్థాపన చేశారు. అబివృద్ధిని వికేంద్రీకరణ నినాదంతో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే అమరావతి రాజధాని రైతులు ఏపీ హైకోర్టును కోర్టును ఆశ్రయించారు.అయితే మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.