తమ కుటుంబాన్ని విమర్శించే హక్కు పవన్ కళ్యాణ్ కు లేదని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ మాదిరిగా తమ కుటుంబం ప్యాకేజీ తీసుకోలేదన్నారు.
విశాఖపట్టణం:పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కచ్చితంగా ప్యాకేజీ స్టార్ అని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. పీఎస్‌పీకే అంటే ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఘాటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారంనాడు విశాఖపట్టణంలో ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మీడియాతో మాట్లాడారు.నిన్న శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ఆయన కౌంటరిచ్చారు. తన కుటుంబం గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. పవన్ కళ్యాణ్ మాదిరిగా ప్యాకేజీలకు తాళాలు కొట్టే కుటుంబం తమది కాదని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని మంత్రి అమర్ నాథ్ కోరారు.మా నాన్న మంత్రిగా పనిచేశారన్నారు. తాను కూడా మంత్రిగా పనిచేస్తున్నట్టుగా మంత్రి చెప్పారు.మా తాత, మా నాన్న, తాను కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయాన్ని మంత్రి గుడివాడ అమర్ నాథ్ గుర్తు చేశారు.
తిట్టడానికి సభ పెట్టలేదని చెబుతూనే సీఎం జగన్ సహా ,వైసీపీ నేతలను పవన్ కళ్యాణ్ నిన్నటి సభలో తిట్టాడని మంత్రి అమర్ నాథ్ చెప్పారు.చంద్రబాబు నాయుడు పల్లకి మోయడానికి సభ పెట్టినట్టుగా ఉందని మంత్రి విమర్శించారు.నా పేరు గుర్తు లేదు సరే... నీ భార్య పిల్లలు పేర్లైనా గుర్తుకు ఉన్నాయా అని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. నీలాంటి వాడి నోటీ నుండి తన పేరు రాకపోవడం తనకు మంచిదేనని మంత్రి చెప్పారు.
undefined
also read:ఈ జన్మకు సీఎం కాలేడు: పవన్ కళ్యాణ్ కు మంత్రి అప్పలరాజు కౌంటర్
జనసేన పేరును చంద్రసేనగా మారిస్తే ఫర్ ఫెక్ట్ గా ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్ధం కాదన్నారు. పోరాటం చేస్తానని చెప్పేది నువ్వే, ఒంటరిగా పోరాడితే వీర మరణం తప్పదని ప్రకటించింది పవన్ కళ్యాణేనని మంత్రి గుడివాడ అమర్ నాథ్ గుర్తు చేశారు. గౌరవం తగ్గకుండా ఉండడానికి 10 లేదా 15 సీట్లలో పోటీ చేస్తావా అని పవన్ కళ్యాణ్ ను మంత్రి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు ఉన్నవి నారావారి నరాలు, పసుపు రక్తమని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు.2014 నుండి 2019 వరకు డైరీలో నీకు పేజీలు లేవా అని ప్రశ్నించారు. డబ్బులిస్తే ఆ పేజీలన్నీ చించేస్తావా అని మంత్రి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారి అంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేనను చంద్రసేగా మార్చేస్తున్నట్టుగా చెప్పడానికి సభ పెట్టారని మంత్రి విమర్శించారు. సంక్రాంతి మామూళ్లు తీసుకుని రణస్థలంలో ఈవెంట్ పెట్టి వెళ్లారని పవన్ కళ్యాణ్ పై మంత్రి ఫైరయ్యారు.