ఒకరితో ప్రేమవివాహం.. మరొకరితో వివాహేతర సంబంధం... తట్టుకోలేక ఈగలమందు తాగి భార్య ఆత్మహత్య..

Published : Jan 13, 2023, 11:16 AM IST
ఒకరితో ప్రేమవివాహం.. మరొకరితో వివాహేతర సంబంధం... తట్టుకోలేక ఈగలమందు తాగి భార్య ఆత్మహత్య..

సారాంశం

ప్రేమ వివాహం చేసుకున్న భర్త మరో మహిళతో వివాహేతర సంబంధంపెట్టుకోవడంతో మనస్తాపం చెందిన భార్య ఈగల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 

ఏలూరు : ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య తగాదాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. భార్య ఈగల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఎస్ఐ ఎం.సాగర్ బాబు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఈ విధంగా తెలియజేశారు.. ఎ.పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి సతీష్ భార్య ఆత్మహత్య చేసుకుంది. సతీష్ కు అదే గ్రామానికి చెందిన దేవి (20) అనే మహిళతో రెండేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి మూడు నెలల చిన్నారి కూడా ఉంది. 

సతీష్ కూలీ పనులకు వెళ్తుంటాడు. రోజూలాగే ఆరోజు కూడా కూలీ పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి  భోజనానికి వచ్చాడు.  ఆ సమయంలో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. భోజనం చేసిన తర్వాత సతీష్ తిరిగి పనికి వెళ్ళిపోయాడు. ఈ గొడవతో దేవి మనస్థాపం చెందింది. ఇంట్లో ఉన్న ఈగల మందు తాగి  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే ఇంట్లో ఉన్న దేవి అత్త నిర్మల ఇంట్లోనే ఉన్న దేవి అత్త నిర్మల ఇది గమనించింది. వెంటనే, కుటుంబ సభ్యులతో విషయాన్ని చెప్పి..  జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లింది.

సిబిఐ ఆఫీసులో ఉద్యోగం పేరుతో ప్రియుడితో సహవాసం.. భర్తకు ఉరివేసి చంపి.. అదృశ్యమయ్యాడని..

అక్కడ చికిత్స పొందుతూ దేవి మరణించింది. అక్కడ చికిత్స పొందుతూ దేవి మరణించింది ఆమె ఆత్మహత్యపై ఎ. పోలవరానికి చెందిన దేవి సోదరి తమ్మిశెట్టి నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేవి సతీష్ లది ప్రేమ వివాహమని చెప్పింది. సతీష్ కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. ఈ విషయం తెలియడంతో దేవి సతీష్ ల మధ్య గొడవలు జరుగుతున్నాయని  చెప్పింది. 

ఫోన్ విషయంలో కూడా ఇటీవల గొడవ జరిగిందని.. ఈ గొడవలో సతీష్ తన చెల్లెలు దేవిని కొట్టాడని చెప్పుకు వచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దేవి ఈగల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, తన చెల్లెలితో సతీస్ బలవంతంగా మందు తాగించాడని కూడా అనుమానంగా ఉందని  ఆమె తెలిపింది. తమ చెల్లి మృతికి న్యాయం జరగాలని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్