సినిమాల్లో పవన్ హీరో , నిజ జీవితంలో జగన్ హీరో: జనసేనానిపై మంత్రి గుడివాడ ఫైర్

By narsimha lodeFirst Published Aug 14, 2023, 9:58 PM IST
Highlights

విస్సన్నపేటకు వెళ్లి  ఏం చేశారని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్ నాథ్.
 

విశాఖపట్టణం:  పవన్ కళ్యాణ్  విస్సన్నపేట  పర్యటన కొండను తవ్వి ఎలుకనే కాదు కనీసం వెంట్రుకను కూడ పట్టులేకపోయారని  ఏపీ పర్యాటక శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్  ఎద్దేవా చేశారు.సోమవారంనాడు   విశాఖపట్టణంలోని విస్సన్నపేట భూములను  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పరిశీలించారు.  ఈ పర్యటనపై  మంత్రి అమర్ నాథ్  స్పందించారు. విస్సన్నపేటలో రూ. 13 వేల కోట్ల పెట్టుబడితో  రియల్ ఏస్టేట్ వ్యాపారం సాగుతుందని  చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. విస్సన్న పేట గ్రామంలో అక్రమాలు అన్యాయాలు నిరూపించావా అని  పవన్ కళ్యాణ్ ను  ప్రశ్నించారు మంత్రి.

విశాఖపట్టణంలో గీతం యూనివర్శిటీ  40 ఎకరాల  ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఎందుకు మాట్లాడలేదని  ఆయన  పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.సినిమాలో పవన్ కళ్యాణ్    హీరో, సీఎం జగన్ నిజ జీవితంలో హీరో అని   మంత్రి  అమర్ నాథ్ చెప్పారు. 
తోటి సినిమా హీరోలను చూసి పవన్ అసూయపడాలి.... కానీ సీఎం జగన్ ను  చూసి ఎందుకు  అసూయపడుతున్నాడో అర్ధం కావడం లేదన్నారు. సమస్యలపై అవగాహన ఉండాలంటే కనీసం డిగ్రీ పాసవ్వాలని  ఆయన పవన్ కళ్యాణ్ కు చురకలంటించారు. 

also read:ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారు: విస్సన్నపేట భూములను పరిశీలించిన పవన్ కళ్యాణ్

ముఖ్యమంత్రిగా జగన్ ను చూడలేక  పవన్ కళ్యాణ్  ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని  ఆయన  మండిపడ్డారు.రుషికొండ,  విస్సన్నపేట వెళ్లి ఏం సాధించారని పవన్ కళ్యాణ్ ను  ప్రశ్నించారు  మంత్రి అమర్ నాథ్.60 ఏళ్లుగా తమ కుటుంబం  ప్రజా  జీవితంలో ఉందని  గుడివాడ అమర్ నాథ్ చెప్పారు.లోకేష్ కంటే  చంద్రబాబును సీఎం చేసేందుకు  పవన్ కళ్యాణ్ ఎక్కువ కష్టపడుతున్నాడని  మంత్రి విమర్శించారు. తనను నమ్ముకున్న వారిని  పవన్ కళ్యాణ్ మూట కట్టి చంద్రబాబుకు అమ్మేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను తమ ప్రభుత్వం కాపాడుతుందన్నారు.

సిట్ రిపోర్ట్ లో వున్న 86మంది పై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.వారాహి విజయ యాత్రలో భాగంగా  పవన్ కళ్యాణ్ ఈ నెల  19వ తేదీ వరకు  విశాఖపట్టణం జిల్లాలో పర్యటించనున్నారు. వారాహి యాత్రలో భాగంగా  పవన్ కళ్యాణ్  విశాఖ జిల్లా నుండి  ఏపీ సీఎం వైఎస్ జగన్ పై  తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


 

click me!