ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్కచోట కూడా గెలవలేకపోయాడని విమర్శించారు. పార్టీ అధినేతగా ఆయనకే దిక్కులేనప్పుడు ఏదో పోరాటం చేసేస్తాడంట అంటూ మండిపడ్డారు.
శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. రాష్ట్రంలో అన్ని విధాలుగా విఫలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం పవన్ చేపట్టబోతున్న లాంగ్ మార్చ్ కేవలం రాజకీయ ఉనికి కోసమేనని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక కొరతకు చంద్రబాబు నాయుడు వైఖరే కారణమని ఆరోపించారు. రాస్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇసుక మాఫియా చెలరేగిపోయిందన్నారు.
ఆనాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెుదపలేదని నిలదీశారు. ఇప్పుడు మాత్రం తగుదునమ్మా అంటూ వచ్చి నిరసనల పేరుతో రాజకీయం చేస్తారా అంటూ మండిపడ్డారు .
ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్కచోట కూడా గెలవలేకపోయాడని విమర్శించారు. పార్టీ అధినేతగా ఆయనకే దిక్కులేనప్పుడు ఏదో పోరాటం చేసేస్తాడంట అంటూ మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. సీఎం జగన్ పేరెత్తే అర్హత కూడా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణాలు ఏంటో తెలియని పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా కొనసాగే అర్హత లేదన్నారు.
పవర్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు అధికార దాహం ఎక్కువ అంటూ తిట్టిపోశారు. అందువల్లే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన కుటిల రాజకీయాలను ప్రజలు గమనించారని చెప్పుకొచ్చారు. అందువల్లే 2019 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని అయినప్పటికీ నేతల్లో మార్పు రావడం లేదని మండిపడ్డారు మంత్రి ధర్మాన కృష్ణదాస్.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఇంతలా వర్షాలు కురిశాయని నదులు ఉప్పొంగిపోయాయని ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొందన్నారు. జగన్ అధికారంలోకి రావడంతో ప్రకృతి సైతం పరవశించిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
జనసేన లాంగ్ మార్చ్ కి బాబు టీం రెడీ: పవన్ తో అడుగేయనున్న ముగ్గురు మాజీమంత్రులు
ట్రాక్టర్లతో తొక్కించి చంపారు-వనజాక్షిపై దాడి చేశారు: పవన్ పై మంత్రి కన్నబాబు
పవన్ నీది రాంగ్ మార్చ్, బాబుతో స్నేహం చేస్తే భవిష్యత్ కష్టమే: మంత్రి అనిల్