సజ్జలపై వ్యాఖ్యలు... ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు: గంగుల కమలాకర్‌కు ఏపీ మంత్రి చెల్లుబోయిన వార్నింగ్

By Siva KodatiFirst Published Oct 2, 2022, 3:12 PM IST
Highlights

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు వార్నింగ్ ఇచ్చారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ . రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని చెల్లుబోయిన హితవు పలికారు. 
 

వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లోనూ కలకలం రేపుతున్నాయి. దీనిపై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఘాటుగా స్పందించారు. ఏపీ ఉద్యోగులపై మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపైనే సజ్జల స్పందించారని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని చెల్లుబోయిన హితవు పలికారు. కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి ప్రతిరూపమని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. 

ఇకపోతే.. శనివారం తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీ బీజేపీకి బీ పార్టీగా నిలుస్తోందని ఆరోపించారు. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టేలా జగన్ ప్రభుత్వం చూస్తోందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌లు టీఆర్ఎస్‌ కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని గంగుల మండిపడ్డారు. సజ్జల మాతో ఎందుకు పెట్టుకుంటున్నారని గంగుల ప్రశ్నించారు. మా సంగత తెలియదా..? గతంలో చూశారుగా, మళ్లీ చూస్తారా అంటూ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Also REad:వైఎస్ కుటుంబం విచ్ఛిన్నం.. ఇప్పుడు కేసీఆర్‌పై కన్ను, సజ్జల బుద్ధే అంత : గంగుల కమలాకర్ వ్యాఖ్యలు

సజ్జల బుద్ధి కుటుంబాల మధ్య చిచ్చుపెట్టేది అంటూ గంగుల అన్నారు. వైఎస్ కుటుంబంలో తల్లిని కొడుకుని.. కొడుకుని , చెల్లిని, అన్నని విచ్ఛిన్నం చేస్తున్నాడని కమలాకర్ ఆరోపించారు. వైసీపీ నేతలు తెలంగాణపై ఎందుకు విషం చిమ్ముతున్నారని ఆయన ప్రశ్నించారు. 2009లో తాను ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా వున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో కూడా తెలియదని గంగుల అన్నారు. 2014లో వైఎస్ కుటుంబంలో ఉడుములాగా ప్రవేశించాడని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విచ్ఛిన్నం చేయడంలో ముఖ్య భూమిక పోషించింది సజ్జల రామకృష్ణారెడ్డే అని గంగుల ఆరోపించారు. 

మేం రెచ్చిపోకముందే మా జోలికి రాకుండా వుంటే మంచిదని ఆయన సజ్జలకు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడే వైసీపీ మంత్రులూ ఖబడ్దార్ అంటూ కమలాకర్ హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని.. ఏపీ నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నాయని గంగుల అన్నారు. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారిని .. తెలంగాణలో వుంటారా..? ఆంధ్రాలో వుంటారా అని అడిగితే తెలంగాణలోనే వుంటామని చెబుతారని గంగుల పేర్కొన్నారు. బీజేపీ కనుసన్నల్లోనే వైసీపీ పనిచేస్తోందని.. మోటార్లకు మీటర్లు పెట్టమని కేసీఆర్ చెబితే, జగన్ ఎందుకు పెట్టారని మంత్రి ప్రశ్నించారు. 
 

click me!