మహానాడంతా బాబు భజనే.. రామ భజన చేసుంటే పుణ్యమైనా వచ్చేది: బొత్స సెటైర్లు

Siva Kodati |  
Published : May 28, 2021, 06:51 PM IST
మహానాడంతా బాబు భజనే.. రామ భజన చేసుంటే పుణ్యమైనా వచ్చేది: బొత్స సెటైర్లు

సారాంశం

టీడీపీ, చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన మహానాడులో ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

టీడీపీ, చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన మహానాడులో ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని బొత్స ఆరోపించారు.

చంద్రబాబును పొడిగించుకోవడానికే జూమ్ కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా పోషించడం లేదని బొత్స వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో కూర్చొని తండ్రీకొడుకులు జూమ్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

Also Read:ఆ ప్రాజెక్టులు పూర్తవ్వడానికి వందేళ్ళు... జగన్ పాలిట శాపమదే: చంద్రబాబు సీరియస్

చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తనకు అయినవారికే చంద్రబాబు దోచిపెట్టారని .... మహానాడులో బాబు భజన మానేసి రామ భజన చేసుంటే పుణ్యమైనా వచ్చేదని ఆయన సెటైర్లు వేశారు. ప్రజలను మేనేజ్ చేయలేరు కనుకే 2019లో చంద్రబాబు ఓడిపోయారని బొత్స ఎద్దేవా చేశారు. 

PREV
click me!

Recommended Stories

Tirumala : వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి అభిషేక దర్శనం.. మీకూ ఈ అదృష్టం దక్కాలంటే ఏం చేయాలో తెలుసా?
IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా