ఆనందయ్య మందు.. రేపు సీసీఆర్ఏఎస్ నివేదిక: ఆయుష్ కమీషనర్ రాములు

By Siva KodatiFirst Published May 28, 2021, 6:23 PM IST
Highlights

ఆనందయ్య మందుపై రేపు సీసీఆర్ఏఎస్ నివేదిక వస్తుందన్నారు ఆయుష్ కమీషనర్ రాములు. శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ...మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ సూచించినట్లు తెలిపారు. కంటి మందు విషయంలో కొన్ని రిపోర్టులు రావాల్సి వుందని రాములు చెప్పారు. 

ఆనందయ్య మందుపై రేపు సీసీఆర్ఏఎస్ నివేదిక వస్తుందన్నారు ఆయుష్ కమీషనర్ రాములు. శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ...మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ సూచించినట్లు తెలిపారు. కంటి మందు విషయంలో కొన్ని రిపోర్టులు రావాల్సి వుందని రాములు చెప్పారు. 

ఆనందయ్య మందుపై అన్ని నివేదికలు పాజిటివ్‌గా వచ్చాయని రాములు చెప్పారు. హైకోర్టు తీర్పు తర్వాత మందు పంపిణీపై సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆనందయ్య మందుపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించలేదని రాములు చెప్పారు. ఆయుర్వేదం గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. 

ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతోనే మందు తయారీని ఆపేశానన్నారు ఆనందయ్య. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే మందు తయారు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మందు ఇస్తానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆనందయ్య తెలిపారు. తన దగ్గర ఆ వనమూలికలు, ద్రవ్యాలు కూడా లేవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి రాగానే మందు తయారు చేసి, పంపిణీ చేస్తానని ఆనందయ్య వెల్లడించారు. 

Also Read:ఆచూకీ లేదు, ఆనందయ్యను వదిలేయండి: కృష్ణపట్నం గ్రామస్తులు

అంతకుముందు ఆనందయ్య ఎక్కడున్నా విడిచి పెట్టాలని కృష్ణపట్నం గ్రామప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజులుగా ఆనందయ్య ఆచూకీ లేదని.. ఆయన ఎక్కడ వున్నారో తెలియడం లేదని గ్రామస్తులు అంటున్నారు. కృష్ణపట్నం పోర్ట్‌లో ఆనందయ్య వున్నాడని.. ఆయనే తనను వదిలిపెట్టాలని కోరుతున్నారనే సమాచారంతో గ్రామస్తులు ఈ డిమాండ్ చేస్తున్నారు. 

కాగా.. మందు తయారీ, పంపిణీపై జోక్యం చేసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆనందయ్య  గురువారం నాడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై సోమవారం నాడు  విచారణ నిర్వహించనుంది హైకోర్టు.దాదాపు ఐదు రోజులుగా  ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది.  మందుకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.  ఆనందయ్య మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన రెండు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది. మరోవైపు ఆనందయ్య కూడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 

click me!