ఏపీఈఏపీసెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ విడుదల చేశారు.
అమరావతి: ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారంనాడు విడుదల చేశారు. ఇంజనీరింగ్ లో 76.32 శాతం ఉత్తీర్ణత , అగ్రికల్చర్ కోర్సుల్లో 89.65 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నెల 15 నుండి 23వ తేదీ వరకు ఏపీ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలను cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
ఇంజనీరింగ్ విభాగంలో ఉమేష్ వరుణ్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. తెలంగాణ ఎంసెట్ లో కూడ ఉమేష్ వరుణ్ మూడో ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే.
ఇంజనీరింగ్ విభాగంలో మొదటి పది స్థానాల్లో బాలురే నిలిచారు. ఉమేష్ కు 158 మార్కులు వచ్చాయి. జేఎన్‌టీయూ అనంతపురం ఏపీ ఈఏపీసెట్ పరీక్షలను నిర్వహించింది.
undefined
ఇంజనీరింగ్ ర్యాంకర్లు వీరే
1. ఉమేష్ వరుణ్ (ఫ్రథమ ర్యాంక్)
2. అభినవ్ చౌదరి(రెండో ర్యాంక్)
3. సాయిదుర్గారెడ్డి (మూడో ర్యాంక్)
4. బాబు సుజన్ రెడ్డి(నాలుగో ర్యాంక్(
5.వెంకట యుగేష్(ఐదో ర్యాంక్)
అగ్రికల్చర్ ర్యాంకర్లు వీరే
1. సత్యరాజు జశ్వంత్ (ప్రథమ ర్యాంక్)
2. వరుణ్ చక్రవర్తి( రెండో ర్యాంకు)
3. రాజ్ కుమార్ (మూడో ర్యాంక్)
4.సాయి అభినవ్ (నాలుగో ర్యాంక్)
5.కార్తికేయ రెడ్డి(ఐదో ర్యాంక్)
తెలంగాణలో ఇప్పటికే ఎంసెట్ పరీక్ష పలితాలు వెల్లడయ్యాయి. ఇవాళ ఏపీ ప్రభుత్వం ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను వెల్లడించింది. నీట్, ఐఐటీ జేఈఈ పరీక్ష ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.