విశాఖలో పట్టాలు తప్పిన గూడ్స్: పలు రైళ్లు రద్దు

By narsimha lode  |  First Published Jun 14, 2023, 10:10 AM IST

విశాఖ జిల్లాలోని  తాడి- అనకాపల్లి  మధ్య  బుధవారంనాడు  తెల్లవారుజామున  గూడ్స్ రైలు  పట్టాలు తప్పింది.   దీంతో ఈ మార్గంలో  పలు  రైళ్లు  ఆలస్యంగా నడుస్తున్నాయి


విశాఖపట్టణం:  విశాఖ జిల్లా తాడి- అనకాపల్లి మధ్య  పట్టాలు  బుధవారంనాడు   గూడ్స్ రైలు  పట్టాలు తప్పింది. దీంతో విశాఖ పట్టణం- బెజవాడ  మార్గంలో పలు రైళ్లు రద్దు  చేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా  నడుస్తున్నాయి. ఇవాళ  ఉదయం  3:35 గంటలకు బొగ్గు లోడ్ తో వెళ్తున్న  గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.  బోగీలు  పట్టాలు తప్పడంతో  పూర్తిగా  ట్రాక్ దెబ్బతింది.  దీంతో  జన్మభూమి, సింహాద్రి,  రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను  రద్దు  చేశారు. 

విశాఖ-సికింద్రాబాద్  వందేభారత్ ఎక్స్ ప్రెస్  రైలు మూడు గంటల పాటు ఆలస్యంగా నడుస్తుంది.  ట్రాక్  పునరుద్దరణ  పనులు  చేపట్టారు  రైల్వే అధికారులు. ట్రాక్  పునరుద్దరించిన  తర్వాత  ట్రాక్ పైకి గూడ్స్ రైలుకు  తీసుకువచ్చారు రైల్వే శాఖాధికారులు.ఇటీవలనే  ఒడిశా  రాష్ట్రంలోని బహనాగ రైల్వే స్టేషన్ లో కోరమాండల్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో  280 మందికి పైగా  మృతి చెందారు.  

Latest Videos

click me!